×

స్నానఘట్టాల వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలి

స్నానఘట్టాల వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలి

శ్రీశైల  దేవస్థానం:మహాశివరాత్రి ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా బుధవారం ధర్మకర్తల మండలి

అధ్యక్షులు  రెడ్డివారిచక్రపాణిరెడ్డి, కార్యనిర్వహణాధికారి  డి. పెద్దిరాజు పలు ప్రాంతాలలో
పర్యటించారు.

గంగాభవాని స్నాన ఘట్టాలు, పలు పార్కింగ్‌ ప్రదేశాలు, పలు వసతి సముదాయాలను
పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంగాభవాని స్నానఘట్టాలు ఆలయానికి సమీపంలో ఉన్న
కారణంగా అధిక సంఖ్యలో భక్తులు ఈ స్నానఘట్టాలకు కూడా వచ్చే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తులు ముఖ్యంగా శివదీక్ష భక్తులు ఈ స్నానఘట్టాలలో స్నానాలు
చేసేందుకు ప్రాధాన్యత ఇస్తారన్నారు. అందుకే స్నానఘట్టాల వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లను వెంటనే పూర్తి
చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు.గంగాభవాని స్నానఘట్టాల వద్ద వీలైనన్ని ఎక్కువ కుళాయిలను ఏర్పాటు చేయాలన్నారు.ప్రత్యేకంగా పారిశుద్ధ్య సిబ్బందిని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు స్నానఘట్టాలను, అక్కడి పరిసరాలను శుభ్రపరుస్తుండాలని పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. గంగాభవాని స్నానఘట్టాల వద్ద మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలన్నారు.

అనంతరం క్షేత్రపరిధిలోని పలు పార్కింగ్‌ ప్రదేశాలను పరిశీలించారు. అన్ని పార్కింగ్‌ ప్రదేశాలలో కూడా సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. పార్కింగ్‌ ప్రదేశాల దారి తెలిసేవిధంగా సూచికబోర్జులు
ఉండాలన్నారు.ఈ పరిశీలనలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ వి.రామకృష్ణ, సహాయ కార్యనిర్వహణాధికారి ఐ.ఎన్‌.వి.
మోహన్‌, పర్యవేక్షకులు అయ్యన్న, శివప్రసాద్‌, అసిస్టెంట్‌ ఇంజనీరు ప్రణయ్‌, ఉద్యానవన అధికారి లోకేష్‌
తదితర సిబ్బంది పాల్గొన్నారు.

print

Previous post

బ్రహ్మోత్సవాల ప్రారంభంనాటికంతా అన్ని ఏర్పాట్లు పూర్తి కావాలి-శ్రీశైల దేవస్థానం ఈ ఓ ఆదేశాలు

Next post

వేములవాడ టెంపుల్ డెవలప్ మెంట్ అథారిటీ తో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష

Post Comment

You May Have Missed