శ్రీశైల దేవస్థానం:నక్షత్రవన ప్రహరిగోడ నిర్మాణపు పనులు ఆదివారం ప్రారంభమయ్యాయి. సుమారు రూ.27 లక్షల వ్యయంతో ఈ నిర్మాణపు పనులను చేపట్టారు.సంప్రదాయబద్ధంగా భూమిపూజ చేసి ఈ ప్రహరిగోడ నిర్మాణపు పనులు ప్రారంభించారు. ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజు, ధర్మకర్తలమండలి సభ్యులు మేరాజోత్ హనుమంతనాయక్, శ్రీమతి బి పద్మజ పాల్గొన్నారు.ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు వి.రామకృష్ణ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు నరసింహరెడ్డి, అసిస్టెంట్ ఇంజనీర్లు సీతారమేష్, జైపాల్ తదితరులు పాల్గొన్నారు.
గణేశసదనం పేరుతో నిర్మిస్తున్న 224 గదుల సముదాయ సమీపంలో అంటే వలయ రహదారి నైరుతి భాగంలో సుమారు 6 ఎకరాల విస్తీర్ణములో ఈ నక్షత్రవనం ఏర్పాటు అవుతోంది.
ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు , సభ్యులు మాట్లాడుతూ ప్రహరీ నిర్మాణపు పనులు వీలైనంత త్వరలో పూర్తి చేయాలని సూచించారు. పనులలో పూర్తి నాణ్యత ప్రమాణాలను పాటించాలన్నారు.
తరువాత ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు , సభ్యులు శ్రీలలితాంబికా వాణిజ్య సముదాయంలో నూతనంగా నిర్మిస్తున్న 36 దుకాణ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ నెలాఖరుకంతా ఈ నిర్మాణాపు పనులు పూర్తి చేయాలని గుత్తేదారునుకి సూచించారు.తరువాత వారు సిద్దిరామప్ప వాణిజ్య సముదాయం వద్ద ర్యాంపు పనులను కూడా పరిశీలించారు.నందిసర్కిల్ వద్ద అంతర్గత రహదారిపై రోడ్డు ప్యాచ్ వర్కులను కూడా వీరు పరిశీలించారు.ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి సభ్యులు మాట్లాడుతూ క్షేత్రపరిధిలోని అంతర్గత రహదారులపై డివైడర్ లైన్స్, రేడియం స్టడ్స్ ఏర్పాటు అంశాన్ని పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవాలని సూచించారు.