శ్రీశైల దేవస్థానం:శ్రీశైలం ప్రాజెక్టుకాలనీలో దేవస్థానం నిర్మిస్తున్న సిబ్బంది వసతి గృహాల నిర్మాణపు పనులను సోమవారం ఈ ఓ పెద్దిరాజు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ పరిశీలనలో ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజు కూడా ఉన్నారు.
దేవస్థానం సిబ్బంది కోసం శ్రీశైలంప్రాజెక్టు కాలనీలో స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణాన్ని దేవస్థానం చేపట్టగా
మొత్తం 3 నమూనాలలో , 1 – బి హెచ్ కె స్మాల్, 1 – బిహెచ్ కె బిగ్ మరియు 2 బిహెచ్ కె బిగ్ పేర్లతో వీటిని దేవస్థానం నిర్మిస్తున్నది.సిబ్బంది కోసం మొత్తం 297 వసతి గృహాలు నిర్మిస్తున్నారు.
ఈ ఓ మాట్లాడుతూ నిర్మాణపు పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
నిర్మాణంలో పూర్తిగా నాణ్యత ప్రమాణాలను పాటించాలన్నారు. ఏ చిన్నపనిలో కూడా నాణ్యతపరంగా రాజీ పడకూడదని అధికారులకు సూచించారు.
ఈ గృహ నిర్మాణపు పనులు పూర్తి కావడాన్ని అనుసరించి దేవస్థానం సిబ్బందిని సున్నిపెంటకు
తరలిస్తారు.ఈ కార్యక్రమం లో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ మురళీధరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.