శ్రీశైల దేవస్థానం: పరిపాలనాంశాలలో భాగంగా ఆదివారం కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న
ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఘంటామఠం, విభూతి మఠం, గణేశసదనాన్ని
పరిశీలించారు.ప్రాచీన కట్టడాల పరిరక్షణలో భాగంగా దేవస్థానం పంచమఠాల పునర్నిర్మాణ పనులను చేపట్టి
పూర్తి చేసింది.
ఇప్పటికే ఘంటామఠానికి సంబంధించి గర్భాలయం, అంతరాలయం, ముఖమండపం,
విమానగోపుర నిర్మాణాలు పూర్తి చేసారు. ఘంటామఠ ప్రాంగణములోని ఉపాలయాలు
కూడా పూర్తి చేసారు.
ఈ సందర్భంగా ఈ ఓ మాట్లాడుతూ మఠా ల ప్రాంగణాల చుట్టూ పచ్చదనాన్ని ( ల్యాండ్ స్కేపింగ్ గార్డెనింగ్) అభివృద్ధి చేయాలన్నారు. ఈ వర్షకాలం పూర్తయ్యేలోగా పనులన్ని పూర్తి చేయాలన్నారు.ముఖ్యంగా మఠాల ప్రాంగణాలలో బిల్వం, కదంబం లాంటి దేవతా వృక్షాలను నాటాలన్నారు.క్షేత్ర పరిధిలో ముఖ్యమైన కూడళలో సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించారు. అదేవిధంగా ఘంటామఠంలోని కౌమారీదేవి, పాండవ గుహ వద్ద ఉన్న
కాలఖైరవస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. అదేవిధంగా
జటావీరభద్రమఠాన్ని కూడా పునరుద్ధరించాలన్నారు.అనంతరం విభూతి మఠమును పరిశీలించారు. విభూతిమఠం చుట్టూ కూడా గార్డెనింగ్ ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా భక్తులందరు ఈ మఠాలన్నింటికి ఒకేసారి దర్శించుకునేందుకు వీలుగా అన్నిమఠాలను కలుపుతూ (ఒకే సర్కూట్‌గా) ఏక రహదారిని నిర్మించే పనులు వీలైనంత
త్వరగా పూర్తి చేయాలన్నారు.
గణేశ సదన్ పరిశీలన :
గణేశ సదన్ నిర్మాణాన్ని త్వరలో ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ రోజు కార్యనిర్వహణాధికారి ఇంజనీరింగ్ అధికారులతో కలిసి గణేశసదనం నిర్మాణాన్ని
పరిశీలించారు.టూరిస్ట్ బస్టాండ్ సమీపంలో భక్తుల వసతి కోసం 220 గదుల సముదాయముగా గణేశ
సదనముగా నిర్మించారు.మొత్తం 220 గదులతో నాలుగు బ్లాకులుగా నిర్మిస్తున్న ఈ సముదాయంలో ఎ బ్లాక్ లో
36 గదులు , 8 షూట్లు, బి బ్లాకులో 64 గదులు, సి బ్లాకులో 48 గదులు, డి బ్లాకులో 64
గదులు నిర్మించారు.
గజేశ సదనం వెనుక భాగాన అడవి జంతువులు రాకుండా కంచె ఏర్పాటు చేయాలని
ఇంజనీరింగ్ అధికారులను ఈ ఓ ఆదేశించారు. గణేశ సదన్ వద్ద భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయాలని భద్రతా విభాగాన్ని ఆదేశించారు.
ఈ కార్యక్రమం లో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు వి. రామకృష్ణ, మురళీధరరెడ్డి, సి.ఎస్.ఓగా
బాధ్యతలు నిర్వహిస్తున్న రెవెన్యూ పర్యవేక్షకులు శివప్రసాద్, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు (ఐ/సి)
చంద్రశేఖరశాస్తి, టి. సుబ్బారెడ్డి, ఉద్యానవ అధికారి లోకేష్, ఉద్యానవన విభాగ విశ్రాంత అసిస్టెంట్
డైరెక్టర్ ఈశ్వరరెడ్డి, సహాయ ఇంజనీర్లు భవన్, విష్ణు, రాజేష్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
* Pallaki Seva performed in the temple. Archaka swaamulu performed the puuja.EO prticipated in the event.
*Traditional dance performed in the kalaraadhana.
*Nagula chavithi performed in the temple.EO and devotees participated in the event.
*Rush of Pilgrims seen in the temple today. Officials made proper arrangements.