పనులలో పూర్తి నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి-ఈ ఓ ఎస్.ఎస్.చంద్రశేఖర ఆజాద్

*

శ్రీశైల దేవస్థానం:పనులలో పూర్తి నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఈ ఓ ఎస్.ఎస్.చంద్రశేఖర ఆజాద్ అన్నారు.  పరిపాలనాంశాల పరిశీలనలో భాగంగా బుధవారం  కార్యనిర్వహణాధికారి  ఎస్.ఎస్.చంద్రశేఖర ఆజాద్ సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పలు ప్రదేశాలను పరిశీలించారు. ముందుగా సున్నిపెంటలో నిర్మించిన సిబ్బంది వసతిగృహాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఈ ఓ  మాట్లాడుతూ నిర్మాణానికి సంబంధించిన తక్కిన పనులన్నింటిన్నీ వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా అన్ని పనులలో కూడా పూర్తి నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలన్నారు.ముఖ్యంగా సిబ్బంది వసతిగృహాల పరిసర ప్రాంతాలలో పిచ్చిమొక్కలను తొలగించి జంగిల్ క్లియరెన్సు పనులను చేయాలన్నారు. అదేవిధంగా ఆయా ప్రదేశాలన్నింటిని చదును చేయాలన్నారు.

వసతి గృహాలకు సంబంధించి అన్ని బ్లాకుల వద్ద నీటి సంపులను ఏర్పాటు చేయాలన్నారు ఈ ఓ. అన్ని బ్లాకుల వద్ద కూడా ఎలివేటెడ్ ప్రవేశద్వారాలను ఏర్పాటు చేయాలన్నారు. మొత్తం 11 బ్లాకులలో ఈ వసతి గృహాలు నిర్మించారు.

పిల్లలు ఆడుకునేందుకు వీలుగా వసతిగృహాల వద్ద ఆటస్థలాన్ని కూడా ఏర్పాటు చేయాలన్నారు.

ముఖ్యంగా వసతిగృహాల వద్ద రహదారుల పనులు వెంటనే ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.

కాగా మొత్తం 3 నమూనాలలో అనగా 1 – బి.హెచ్. కె. స్మాల్, 1 – బి.హెచ్. కె. బిగ్ మరియు 2 – బి.హెచ్.కె పేర్లతో దేవస్థానం సిబ్బంది వసతి గృహాలను నిర్మించింది.1 – బి.హెచ్.కె స్మాల్ నందు 108 గృహాలు, 1 – బి. హెచ్. కె. బిగ్ నందు 108 గృహాలు, 2 బిహెచ్ కె నందు 81 గృహాలుగా మొత్తం 297 గృహాలు నిర్మించారు.

తరువాత హాటకేశ్వరాలయాన్ని పరిశీలించారు ఈ ఓ. హాటకేశ్వర ఆలయ పరిసరాలలోనూ దేవస్థానం ఆధీనంలో గల స్థలంలో భక్తులు సేద తీరేందుకు యాత్రిక షెడ్లను నిర్మించేందుకు వెంటనే ప్రణాళికలు రూపొందించాలన్నారు. అదేవిధంగా అక్కడ శౌచాలయాలను కూడా ఏర్పాటు చేయాలన్నారు. భక్తులు స్నానాదికాలు చేసుకునేందుకు వీలుగా స్నానపుగదులను మరియు జల్లుస్నానం (వరుబాతులను) ఏర్పాట్లు కూడా వుండాలన్నారు. వీటివల్ల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మరియు ఉగాది మహోత్సవాలలో పాదయాత్రతో వచ్చే భక్తులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు.హాటకేశ్వరాలయం వద్ద నీటిగుండం చుట్టు కటాంజనాన్ని ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా గణేశసదనం కూడా పరిశీలించారు.

ఈ పరిశీలనలో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు ఎం.నరసింహారెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు (ఐ /సి) పి. చంద్రశేఖరశాస్త్రి, పి.వి. సుబ్బారెడ్డి, సంబంధిత సహాయ ఇంజనీర్లు పాల్గొన్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.