శ్రీశైలదేవస్థానం:సిద్దిరామప్ప వాణిజ్య సముదాయం, డార్మెటరీ. కల్యాణకట్టలను కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న పరిశీలించారు .పరిపాలనాంశాల పరిశీలనలో భాగంగా ఈ రోజు (01.09.2021)న కార్యనిర్వహణాధికారి, సిద్ధరామప్ప వాణిజ్య సముదాయం, కల్యాణకట్ట , డార్మెటరీలను పరిశీలించి వివిధ నిర్ణయాలు తీసుకున్నారు.ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ సిద్దిరామప్పకాంప్లెక్స్ లో పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాణిజ్య సముదాయము లో చెత్తచెదారాలు వేయకుండా చూడాలన్నారు. శ్రీశైలక్షేత్రాన్ని స్వచ్ఛశ్రీశైలంగా ఉంచేందుకు దుకాణదారులు, ప్రజలందరూ సహకరించాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కల్యాణకట్టను (కేశఖండనశాల) పరిశీలించారు. కల్యాణకట్టలోని టికెట్ కౌంటరును, రికార్డులను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్యాణకట్టను పరిశుభ్రంగా ఉంచాలని, భక్తులతో మర్యాదపూర్వకంగా మెలగాలన్నారు. కల్యాణకట్ట చుట్టూ మరింత పచ్చదనాన్ని పెంపొందించాలన్నారు.
కోవిడ్ నిబంధనలను పాటించాలని, తలనీలాలు తీసే పరికరాలను ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తగా శుభ్రపరుస్తుండాలన్నారు.ముఖ్యంగా కల్యాణకట్టలో సామాజిక దూరం పాటించడం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. ఈ విషయమై ఉద్యోగులే భక్తులలో అవగాహన కలిగించాలన్నారు.కోవిడ్ నివారణకై తీసుకోవలసిన ముందుజాగ్రత్తలగురించి కల్యాణకట్టప్రాంగణములో మరిన్ని సూచికబోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.
ఆ తరువాత నీలకంఠ డార్మెటరీలను పరిశీలించారు. భక్తులకు డార్మిటరీ వివరాలు తెలిసేవిధంగా మరిన్ని సూచికబోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. క్షేత్రపరిధిలో డార్మెటరీల వద్ద ప్రజా సౌకర్యాల ( శౌచలయాలను) నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. శౌచలయాలను ఎప్పటికప్పుడు విధిగా శుభ్రపరుస్తుండాలన్ని అధికారులను ఆదేశించారు.