శ్రీశైల దేవస్థానం:   శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలో దేవస్థానం నిర్మిస్తున్న సిబ్బంది వసతి గృహాల నిర్మాణపు పనులను గురువారం సాయంత్రం కార్యనిర్వహణాధికారి లవన్న  ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఈ ఓ  మాట్లాడుతూ నిర్మాణపు పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా నిర్మాణంలో పూర్తిగా నాణ్యత ప్రమాణాలను పాటించాలని, ఏ చిన్నపనిలో కూడా నాణ్యతపరంగా రాజీ పడకూడదని అధికారులకు సూచించారు.
కాగా దేవస్థానం సిబ్బంది కోసమై శ్రీశైలంప్రాజెక్టు కాలనీలో స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణాన్ని దేవస్థానం చేపట్టడం జరిగింది.
మొత్తం 3 నమూనాలలో అనగా 1 – బి హెచ్ కె స్మాల్, 1 – బిహెచ్ కె బిగ్ మరియు 2 బిహెచ్ కె బిగ్ పేర్లతో వీటిని దేవస్థానం నిర్మిస్తున్నది.సిబ్బంది కోసమై మొత్తం 297 వసతి గృహాలు నిర్మించబడుతున్నాయి.
ఈ గృహ నిర్మాణపు పనులు పూర్తి కావడాన్ని అనుసరించి దేవస్థానం సిబ్బందిని సున్నిపెంటకు తరలించడం జరుగుతుంది.ఈ కార్యక్రమములో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు వి. రామకృష్ణ, మురళీధరరెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు (ఐ/సి) చంద్రశేఖరశాస్త్రి, సహాయ ఇంజనీర్లు పాల్గోన్నారు.

*Inspection at  Ganga Sadan by Executive Officer Lavanna

*Inspection at  Kalyana Katta

* Inspection at  Dormitary

* Inspection at  Pathleswara Sadan

*Inspection at  Pathala Ganga

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.