
శ్రీశైల దేవస్థానం:ఫిబ్రవరి 11 నుండి 21 తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపధ్యంలో భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఉత్సవాలకు వివిధ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇందులో భాగంగా బుధవారం దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న ఇంజనీరింగ్, ఆలయం అధికారులతో కలిసి ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించారు. పరిశీలనలో ధర్మకర్తల మండలి సభ్యులు మేరాజోత్ హనుమంతు నాయక్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా కృష్ణదేవరాయగోపురం, నాగులకట్ట, అమ్మవారి ఆలయం, కల్యాణమండపం, శ్రీస్వామివారి నిత్య కల్యాణమండ ప్రాంగణం మొదలైన వాటిని పరిశీలించారు.
కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ ఉత్సవ రోజులలో స్వామివారి ఆలయ ముఖమండపంలో మరొక క్యూలైన్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం క్యూలైన్లకంటే కొంచెం ఎత్తులో ఈ క్యూలైన్ ఏర్పాటు చేయాలన్నారు. దీనివలన భక్తులు ఎక్కవగా సమయం వేచివుండ కుండా స్వామివారిని దర్శించుకుంటారన్నారు.
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సందర్భంగా వి.వి.ఐ.పీలకు వి.ఐ.పిలకు వేరు వేరు. గ్యాలరీలను ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు.ఆలయ ప్రాంగణములో ఉత్తర మరియు పశ్చిమ భాగాలలో భక్తులు దర్శించుకునేందుకు తగు ఏర్పాట్లు చేయాలన్నారు.ఈ ప్రదేశాలలో కొంతభాగం సాధారణ భక్తులకు మరికొంత భాగం శివదీక్షస్వాములు కూర్చునేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.అదేవిధంగా మహాశివరాత్రి రోజున శ్రీస్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవం జరిపించే నాగులకట్ట వద్ద కూడా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.శ్రీస్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవం భక్తులకు కనపడే విధంగా ఈ ఏర్పాట్లు చేయాలన్నారు.
పరిశీలనలో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు వి. రామకృష్ణ, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. హరిదాసు, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు నరసింహారెడ్డి, ప్రజాసంబంధాలఅధికారి టి. శ్రీనివాసరావు, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు (ఐ/సి) చంద్రశేఖరశాస్త్రి, స్థపతి ఐ. ఉమావెంకట జవహర్లాల్, రెవెన్యూ విభాగపు పర్యవేక్షకులు అయ్యన్న, ఇంజనీరింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.