
శ్రీశైల దేవస్థానం:శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా పుణ్యక్షేత్రంలో పారిశుధ్య పనులు, త్రాగునీటి సదుపాయం, పార్కింగ్ ప్రదేశాలను జిల్లా కలెక్టర్ డా. కె శ్రీనివాసులు పరిశీలించారు.పారిశుధ్య పనులు ముమ్మరంగా చేపట్టి ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని డిపిఓను ఆదేశించారు.భక్తులకు త్రాగునీటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసిన సింటెక్స్ ట్యాంకులలో త్రాగునీటి కొరత లేకుండా ఎప్పటికప్పుడు నీటిని నింపేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని దేవస్థాన ఈఈని ఆదేశించారు.