వరద నీరు సమస్య లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి: కమిషనర్ రోనాల్డ్ రోస్

హైదరాబాద్, జూన్ 05:   సోమాజిగూడ, ఖైరతాబాద్ ప్రాంతంలో వరద నీరు సమస్య లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు.
బుధవారం కమిషనర్ ఈఎ సి జియా ఉద్దీన్ తో కలిసి వాటర్ స్టాగ్నేషన్ పాయింట్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా మెర్క్యురీ తాజ్ కృష్ణ హోటల్ వద్ద వాటర్ స్టాగ్నేషన్ పాయింట్ లను పరిశీలించారు. ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ వద్ద నుండి వచ్చే వరద  నేరుగా వెళ్లేందుకు మెర్క్యురీ, తాజ్ హోటల్, ఆర్ టి ఏ కార్యాలయం లెక్యూ గెస్ట్ హౌస్ వద్ద సంపులు నిర్మింటానికి  ప్రతిపాదనలు పంపాలని కమిషనర్ ఈ ఈ ని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ జోనల్ ఎస్.ఈ రత్నాకర్, ఈ ఈ  ఇందిరాబాయి తదితరులు పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed