
శ్రీశైల దేవస్థానం:గురువారం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ.5,76,42,564/-
నగదు రాబడిగా లభించిందని ఈ ఓ లవన్న తెలిపారు.ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు గత 22 రోజులలో ( 02.11.2022 నుండి 23.11.2022 వరకు) సమర్పించారని తెలిపారు.22 రోజులకు ఇంత అధిక మొత్తములో హుండీ రాబడి లభించడం ఇదే మొదటిసారి కావడం విశేషమని వివరించారు.ఈ నగదుతో పాటు 391 గ్రాముల 200 మిల్లీగ్రాముల బంగారు, 8 కేజీల 410 గ్రాముల వెండి లభించాయన్నారు.అదేవిధంగా యుఎస్ డాలర్లు – 294 సౌదీ రియాల్స్ -1475, కెనడా డాలర్లు-1,115, యుఏఈ దిర్హమ్స్ – 15, సింగపూర్ డాలర్లు – 2 మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయని , పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును జరిగిందన్నారు.
దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న, ధర్మకర్తలమండలి సభ్యులు మేరాజోత్ హనుమంతు నాయక్, ధర్మకర్తలమండలి ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజు, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, శివసేవకులు ఈ హుండీ లెక్కింపులో పాల్గొన్నారని ఎడిటర్ వివరించారు.