
శ్రీశైల దేవస్థానం:బుధవారం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ. 2,41,95,778/నగదు రాబడిగా లభించిందని ఈ ఓ ఎస్.లవన్న అధికార ప్రకటనలో తెలిపారు. ఆలయ హుండీల ద్వారా రూ.2,30,19,678/- లు లభించగా, అన్న ప్రసాద వితరణ హుండీ ద్వారా రూ. 11,76,100/- లు లభించాయి. వీటిలో ఆలయ హుండీ ఆదాయాన్ని భక్తులు గత 19 రోజులలో ( 14.10.2022 నుండి 01.11.2022 వరకు) సమర్పించారని ఈ ఓ వివరించారు.అన్న ప్రసాద వితరణ హుండీని గత ఆరు మాసాలలో (05.05.2022 నుండి 01.11.2022 వరకు) సమర్పించారు.
ఈ నగదుతో పాటు ఆలయ హుండీలో 128 గ్రాముల బంగారు, 3 కేజీల 790 గ్రాముల వెండి లభించాయని ఈ ఓ తెలిపారు.అదేవిధంగా యుఎన్ఏ డాలర్లు – 299, ఆస్ట్రేలియా డాలర్లు – 30, కెనడా డాలర్లు – 120, మలేషియా రింగిట్స్ – 1, యు.ఎ.ఇ.థిర్ హమ్లు -15, మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయన్నారు.పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టామన్నారు.
దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న, ధర్మకర్తలమండలి సభ్యులు శ్రీమతి బరుగురెడ్డి పద్మజ, శ్రీమతి డా.సి.కనకదుర్గ, ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజు, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది , శివసేవకులు ఈ హుండీ లెక్కింపులో పాల్గొన్నారని ఈ ఓ తెలిపారు.