
శ్రీశైల దేవస్థానం:శుక్రవారం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ. 4,35,23,203 – నగదు రాబడిగా లభించిందని ఈ ఓ తెలిపారు.ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు గత 37 రోజులలో (07.09.2022 నుండి 13.10.2022 వరకు) సమర్పించారు.ఈ నగదుతో పాటు 373గ్రాముల 500 మిల్లీ గ్రాముల బంగారు, 4 కేజీల 400 గ్రాముల వెండి లభించాయన్నారు. యుఎన్ఏ డాలర్లు – 703, ఆస్ట్రేలియా డాలర్లు – 90, కెనడా డాలర్లు – 25, సింగపూర్ డాలర్లు – 15, మలేషియా రింగిట్స్ – 5, ఇంగ్లాండు ఫౌండ్సు – 10, ఈరోస్ – 10, కత్తార్ రియాల్స్ -1 మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయని వివరించారు.