
శ్రీశైల దేవస్థానం:శనివారం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ. 7,19,58,064- నగదు రాబడిగా లభించిందని ఈఓ తెలిపారు.
ఈ హుండీల రాబడిని భక్తులు గత 30 రోజులలో (19.02.2026 నుండి 20.03.2026 వరకు) సమర్పించారు.
అలాగే ఈ హుండీలో 122 గ్రాముల 200 మిల్లీగ్రాముల బంగారు, 6 కేజీల 550 గ్రాముల వెండి లభించాయి.
అదేవిధంగా 624 – యుఎస్ఏ డాలర్లు, 210 – యు.ఎ.ఇ దిర్హమ్స్, 6 – సౌదీరియాల్స్, 10 – సింగపూర్ డాలర్లు , 20 – ఇంగ్లాండు పౌండ్స్ , 14 – మలేషియా రింగిట్స్ , 25 – ఆస్ట్రేలియా డాలర్లు, 70 – యూరోలు, 1 – కువైట్ దినార్, 60 – కెనడా డాలర్లు, 20 – న్యూజిలాండ్ డాలర్లు మొదలైనవి ఈ హుండీల లెక్కింపులో లభించాయి.
ఈ హుండీల లెక్కింపును కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు పర్యవేక్షించారు.
అదేవిధంగా ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీమతి జి. లక్ష్మీశ్వరి, శ్రీమతి యు. సుబ్బలక్ష్మి, శ్రీమతి జిల్లెల శ్రీదేవి, పలువిభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు హుండీ లెక్కింపు పర్యవేక్షణలో పాల్గొన్నారు. హుండీల లెక్కింపులో సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.
