శ్రీశైల దేవస్థానం:
గురువారం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ. 5,61, 81,535/- నగదు రాబడిగా లభించిందని ఈ ఓ తెలిపారు. వివరాలు ఇవి.
హుండీల రాబడిని భక్తులు గత 13 రోజులలో ( 06.02.2026 నుండి 18.02.2026 వరకు) సమర్పించారు.
హుండీలో 124 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారు, 5 కేజీల 550 గ్రాముల వెండి లభించాయి.
22 – యుఎస్ఏ డాలర్లు, 10 – యు.ఎ.ఇ దిర్హమ్స్, 5 – సౌదీరియాల్స్, 4- సింగపూర్ డాలర్లు, 25 – ఇంగ్లాండు పౌండ్స్, 1 – మలేషియా రింగిట్స్, 100 – ఓమన్ బైసాలు, 15 – ఆస్ట్రేలియా డాలర్లు, 5- యూరోలు, 1 – కత్తారు రియాల్స్, 1- ఓమన్ రియాల్స్, 100 – థాయిలాండ్ భట్స్ హుండీల లెక్కింపులో లభించాయి.
పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపు జరిగింది.
హుండీల లెక్కింపులో పలు విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు తదితరులు పాల్గొన్నారు.
