

శ్రీశైల దేవస్థానం:
శుక్రవారం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ. 3,76,22,452/- నగదు రాబడిగా లభించింది.
ఈ హుండీల రాబడిని భక్తులు గత 25 రోజులలో ( 12.01.2026 నుండి 05.02.2026 వరకు) సమర్పించారు.
ఇందులో ఉభయ దేవాలయాల హుండీల ద్వారా 3,73,32,470/-లు మరియు అన్న ప్రసాద వితరణ హుండీల ద్వారా రూ. 2,89,982లు లభించాయి.
అప్రైజర్ హాజరు కాని కారణంగా బంగారు, వెండి లెక్కించలేదు.
అదేవిధంగా 526 – యుఎస్ఏ డాలర్లు, 84 – సింగపూర్ డాలర్లు, 140 – కెనడా డాలర్లు, 10 – ఆస్ట్రేలియా డాలర్లు, 10 – ఈరోస్, 55 – ఇంగ్లాండు ఫౌండ్స్, 28 – మలేషియా రింగిట్స్, 10 – సౌదీరియాల్స్, 800 – ఓమన్ బైసా, 1435– యు.ఎ.ఇ దిర్హమ్స్ ఈ హుండీల లెక్కింపులో లభించాయి.
పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టారు.
ఈ హుండీల లెక్కింపులో ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, డిప్యూటీ కార్యనిర్వహణాధికారిణి ఆర్.రమణమ్మ, పలు విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివ సేవకులు తదితరులు పాల్గొన్నారు.
