
శ్రీశైల దేవస్థానం:బుధవారం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ. 4,51,62,522/- నగదు
రాబడిగా లభించిందని ఈఓ తెలిపారు.
ఈ హుండీల రాబడిని భక్తులు గత 27 రోజులలో ( 24.07.2025 నుండి 19.08.2025 వరకు) సమర్పించినవని ఈ ఓ పేర్కొన్నారు. హుండీలో 164 గ్రాముల 500 మిల్లీ గ్రాముల బంగారు, 5 కేజీల 840 గ్రాముల వెండి
లభించాయని వివరించారు. 598 – యుఎస్ఏ డాలర్లు, 100 – న్యూజిలాండ్ డాలర్లు, 100– సింగపూర్ డాలర్లు, 10 – ఇంగ్లాండు ఫౌండ్స్, 100 – ఈరోస్, 300 – ఓమన్ బైసా, 20 – కెనడా డాలర్లు, 1- కువైట్ దినార్, 115- సౌదీ అరేబియా రియాల్స్, 102 – కత్తార్ రియాల్స్ మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయన్నారు. హుండీల లెక్కింపులో కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, డిప్యూటీ కార్యనిర్వహణాధికారిణి ఆర్.రమణమ్మ, పలు విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు తదితరులు పాల్గొన్నారు.