
శ్రీశైల దేవస్థానం:గురువారం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ.4,17,61,215/- నగదు
రాబడిగా లభించిందని ఈ ఓ తెలిపారు. ఈ హుండీల రాబడిని భక్తులు గత 27 రోజులలో (27.06.2025 నుండి 23.07.2025 వరకు) సమర్పించారని పేర్కొన్నారు.హుండీలో 225 గ్రాముల 600 మిల్లీ గ్రాముల బంగారు, 11 కేజీల 550 గ్రాముల వెండి
లభించాయి.పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపు జరిగింది.ఈ హుండీల లెక్కింపులో కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, డిప్యూటీ కార్యనిర్వహణాధికారిణి ఆర్.రమణమ్మ, పలు విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు తదితరులు పాల్గొన్నారు.