
శ్రీశైల దేవస్థానం:బుధవారం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ. 4,00,23,145 /నగదు రాబడిగా లభించిందని ఈ ఓ తెలిపారు.ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు గత 34 రోజులలో (05.05.2022 నుండి 07.06.2022 వరకు) సమర్పించారు.
ఈ నగదుతో పాటు 391 గ్రాము బంగారు, 9 కేజీల 400 గ్రాముల వెండి లభించాయి. 3278 యు.ఎస్.ఏ డాలర్లు, 05 ఆస్ట్రేలియా డాలర్లు, 05 ఇంగ్లాండు ఫౌండ్స్, 10 యు.ఏ.ఈ దిర్హమ్స్, 10 కెనడా డాలర్లు, 121 కతర్ రియాల్స్, 62 కువైట్ దీనార్లు, 20 సింగపూర్ డాలర్లు, మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి.
పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టామని ఈ ఓ తెలిపారు. దేవస్థాన అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, శివసేవకులు ఈ హుండీ లెక్కింపులో పాల్గొన్నారు.
*Jwala Veerabhadra Swamy Puuja, Saakshi Ganapathi puuja performed in the temple.