శ్రీశైల దేవస్థానం:బుధవారం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ. 5,69,55,455 /-లు
నగదు రాబడిగా లభించిందని ఈ ఓ తెలిపారు.ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు గత 16 రోజులలో (17.02.2025 నుండి 04.03.2025 వరకు) సమర్పించారని పేర్కొన్నారు.
ఈ నగదుతో పాటు 87 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారం, 5 కేజీల 850 గ్రాముల వెండి
లభించాయని ఈ ఓ వివరించారు.అదేవిధంగా యుఎస్ఏ డాలర్లు – 885, యూఏఈ దిర్హమ్స్ – 105, యూకే ఫౌండ్స్ – 80, సింగపూర్ డాలర్లు -2, కెనడా డాలర్లు – 5 మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయన్నారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టామని తెలిపారు. కార్యక్రమం లో దేవస్థానం అధికారులు, సిబ్బంది, శివసేవకులు తదితరులు పాల్గొన్నారు.