శ్రీశైల దేవస్థానం: గురువారం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ.2,58,56,737/-
నగదు రాబడిగా లభించిందని ఇంచార్జి కార్యనిర్వహణాధికారి ఇ. చంద్రశేఖరరెడ్డి తెలిపారు.కాగా ఆలయ హుండీల రాబడిని భక్తులు గత 28 రోజులలో (26.09.2024 నుండి 23.10.2024 వరకు) సమర్పించారని వివరించారు.అలాగే ఈ హుండీలో 379 గ్రాముల, 500 మిల్లీగ్రాముల బంగారం, 8 కేజీల, 030 గ్రాముల వెండి లభించాయన్నారు. అదేవిధంగా 1093– యుఎస్ఏ డాలర్లు, 215 – కెనడా డాలర్లు, 20 – యుకే పౌండ్సు, 10 – యూ.ఏ.ఈ. దిర్హమ్స్, 21 —మలేషియా రింగిట్స్, 10 —మాల్దీవ్స్ రుఫీయాస్, 10- ఈరోస్, 2- సింగపూర్ డాలర్లు, 25 – మౌరీటియస్ రూపాయలు మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయని తెలిపారు.పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపు జరిగిందని తెలపారు.
ఈ కార్యక్రమం లో ఇంచార్జి కార్యనిర్వహణాధికారి ఇ. చంద్రశేఖరరెడ్డి, యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు తదితరులు పాల్గొన్నారు.