హుండీల లెక్కింపు ద్వారా   శ్రీశైల దేవస్థానానికి రూ. 4,00,65,375/- నగదు రాబడి-ఈ వో

 శ్రీశైల దేవస్థానం:గురువారం  జరిగిన హుండీల లెక్కింపు ద్వారా   శ్రీశైల దేవస్థానానికి రూ. 4,00,65,375/-

నగదు రాబడిగా లభించిందని ఈ వో తెలిపారు.

ఇందులో ఆలయ హుండీల ద్వారా రూ.3,86,82,321/-లు , అన్నప్రసాద వితరణ హుండీ ద్వారా 13,83,054/-లు ( మొత్తం రూ. 4,00,65,375/- /- లు) లభించాయని ఈ వో వివరించారు.ఆలయ హుండీల రాబడిని భక్తులు గత 35 రోజులలో (22.08.2024 నుండి 25.09.2024 వరకు) సమర్పించారన్నారు. అన్నదానం హుండీ రాబడి మార్చి 12వ తేదీ నుంచి సెప్టెంబరు 25వ తేదీ వరకు సమర్పించారన్నారు.

అదేవిధంగా 488 యుఎస్ఏ డాలర్లు, 12 – కువైట్స్ దినార్స్, 6000- ఉగాండా షిలింగ్స్, 30 – యుకే పౌండ్సు, 60 – సింగపూర్ డాలర్లు, 20 – హాంకాంగ్ డాలర్లు, 10 – ఈరోస్, 20 – మలేషియా రింగిట్స్ మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయని ఈ ఓ తెలిపారు.పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టామన్నారు. 

ఈ కార్యక్రమం లో కార్యనిర్వహణాధికారి  డి. పెద్దిరాజు, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ ఆర్. రమణమ్మ, పలు విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు తదితరులు పాల్గొన్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.