
శ్రీశైల దేవస్థానం: శుక్రవారం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ. 3,31,70,665/-లు నగదు రాబడిగా లభించిందని ఈ ఓ తెలిపారు. ఆలయ హుండీల రాబడిని భక్తులు గత 29 రోజులలో ( 04.07.2024 నుండి 01.08.2024 వరకు) సమర్పించారని వివరించారు.పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపు జరిగిందన్నారు.
ఈ కార్యక్రమం లో కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు, డిప్యూటీ కార్యనిర్వహణాధికారిణి రవణమ్మ, పలువురు శాఖాధిపతులు, ఆయా విభాగాల పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు తదితరులు పాల్గొన్నారు .