శ్రీశైల దేవస్థానం: హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ. 3, 98, 34,583 /-లు నగదు రాబడిగా లభించిందని ఈ వో తెలిపారు. ఆలయ హుండీల రాబడిని భక్తులు గత 28 రోజులలో (06.06.2024 నుండి
03.07.2024 వరకు) సమర్పించారన్నారు. హుండీలో 148 గ్రాముల బంగారం, 6 కేజీల 260 గ్రాముల వెండి లభించాయి.
835 – యుఎస్ఏ డాలర్లు, 30 – యూరోలు, 2 – ఓమన్ రియాల్స్, 2 – కత్తార్ రియాల్స్, 105 – కెనడా డాలర్లు, 2 – సింగపూర్ డాలర్లు, 35 – – ఆస్ట్రేలియా డాలర్లు, 55 – యూ.ఏ.ఈ దిర్హము, 20 – సౌదీఅరేబియా రియాల్స్, 106 – మలేషియా రింగిట్స్, 80 థాయిలాండ్ బాట్స్ మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయని పేర్కొన్నారు.
పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును జరిగిందని ఈ వో తెలిపారు.
ఈ కార్యక్రమం లో కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు తో పాటు , డిప్యూటీ కార్యనిర్వహణాధికారిణి రవణమ్మ, పలువురు శాఖాధిపతులు, ఆయా విభాగాల పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు తదితరులు పాల్గొన్నారు .