శ్రీశైల దేవస్థానం: బుధవారం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ.3,57,88,078/- నగదు
రాబడిగా లభించిందని ఈ ఓ తెలిపారు. ఆలయ హుండీల ఆదాయాన్ని భక్తులు గత 34 రోజులలో (12.10.2023 నుండి 14.11.2023 వరకు) సమర్పించారన్నారు .అదేవిధంగా 649- యుఎస్ఏ డాలర్లు, 10 మలేషియా రింగిట్స్
50- సింగపూర్ డాలర్లు,70 – కెనడా డాలర్లు, 5- సౌదిరియాల్స్, 39 – కత్తార్ రియాల్స్, 50 – యూఏఈ దిర్హమ్స్, 440 – అస్ట్రేలియా డాలర్లు మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయన్నారు.
పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టామన్నారు.
ఈ హుండీల లెక్కింపులో కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది , శివసేవకులు పాల్గొన్నారు.
- @a glance of second day kaartheeka maasotsavam programmes