శ్రీశైల దేవస్థానం:బుధవారం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ. 4,43,53,163 /-
నగదు రాబడిగా లభించిందని ఈ ఓ లవన్న తెలిపారు.ఇందులో ఆలయ హుండీల ద్వారా రూ. 4,33,94,902/-లు లభించగా, అన్నపూర్ణ భవనంలోని హుండీ ద్వారా ( అన్నప్రసాద వితరణ హుండీ) 9,58,261/-లు లభించాయి.
ఆలయ హుండీల ఆదాయాన్ని భక్తులు గత 32 రోజులలో (24.03.2023 నుండి 25.04.2023 వరకు) సమర్పించారన్నారు. జరిగింది.
ఈ హుండీలో 360 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారు, 12 కేజీల 625 గ్రాముల వెండి లభించాయన్నారు.
అదేవిధంగా యుఎస్ఏ డాలర్లు -2920, ఇంగ్లాండు పౌండ్స్ – 310, న్యూజిలాండ్ డాలర్లు – 770, ఆస్ట్రేలియా డాలర్లు – 10, థాయిలాండ్ కరెన్సీ -3,900, యూ.ఏ.ఈ దిర్హమ్స్ – 40, సౌదీరియాల్స్ -5, కెనెడా డాలర్లు – 35, మలేషియా రింగిట్స్ – 70, ఓమర్ బైసా – 200, యూరో – 110 మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయని వివరించారు.
ఈ హుండీల లెక్కింపులో కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న, ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజు, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.