శ్రీశైల దేవస్థానం:శుక్రవారం జరిగిన శ్రీశైల దేవస్థానం హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ. 2,62,74,717/-లు నగదు రాబడిగా లభించింది.ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు గత 38 రోజులలో సమర్పించారు.
670 యు.ఎస్.ఏ డాలర్లు, 151 కత్తర్ రియాల్స్, 10 సింగపూర్ డాలర్లు, 40 కెనడా డాలర్లు, 50 ఆస్ట్రేలియా డాలర్లు, 5 ఇంగ్లాండ్ ఫౌండ్స్, 1 ఎస్.ఏ.యు రియాల్స్, 10 యు.ఎ.ఇ ధిరామ్స్ , 1 మలేషియన్ రింగిట్ మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి.పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో లెక్కింపు జరిగింది.
దేవస్థాన అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది , శివసేవకులు హుండీ లెక్కింపులో పాల్గొన్నారు.