కర్నూలులో హెచ్‌ఆర్‌సీ కార్యాలయం ప్రారంభం
👉🏻హెచ్‌ఆర్‌సీ చైర్మన్, జ్యుడీషియల్, నాన్ జ్యుడీషియల్ సభ్యులను పూర్ణ కుంభతో స్వాగతం పలికిన వేదపండితులు :-
👉🏻కోవిడ్ థర్డ్ వేవ్ నేపథ్యంలో ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదులు స్వీకరణ :-
👉🏻పాత్రికేయుల సమావేశంలో వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎం.సీతారామమూర్తి :-
కర్నూలు, సెప్టెంబర్ 01 :-కోవిడ్ థర్డ్ వేవ్ నేపథ్యంలో ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తామని ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎం.సీతారామమూర్తి పాత్రికేయుల సమావేశంలో తెలిపారు.
కర్నూలులో రాష్ట్ర మానవహక్కుల కమిషన్ (హ్యూమన్ రైట్స్ కమిషన్ – హెచ్‌ఆర్‌సీ) కార్యాలయాన్ని ఆ సంస్థ ఛైర్మన్ జస్టిస్ ఎం.సీతారామమూర్తి జ్యుడీషియల్, నాన్ జ్యుడీషియల్ మెంబర్లు, జిల్లా కలెక్టర్ లతో కలిసి బుధవారం ప్రారంభించారు.
కర్నూలు నగరంలోని స్టేట్ గెస్ట్ హౌస్ లో రూమ్ నెంబర్-1లో ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎం.సీతారామమూర్తి ఛాంబర్, రూమ్ నెంబర్ – 2లో జ్యుడీషియల్ సభ్యుడు దండే సుబ్రహ్మణ్యం ఛాంబర్, రూమ్ నెంబర్ -4 లో నాన్ జ్యుడీషియల్ సభ్యుడు జి.శ్రీనివాసరావుల ఛాంబర్ లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
అంతకు ముందు హెచ్‌ఆర్‌సీ చైర్మన్ జస్టిస్ ఎం. సీతారామమూర్తి, జ్యుడీషియల్ సభ్యుడు దండే సుబ్రహ్మణ్యం, నాన్ జ్యుడీషియల్ సభ్యుడు జి. శ్రీనివాస రావు కు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వేదపండితులు పూర్ణ కుంభతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం కార్యాలయంలోని చాంబర్లో ఆసీనులై వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు.
అనంతరం మీడియాతో ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎం.సీతారామమూర్తి మాట్లాడుతూ…. ఈ రోజు నుంచి కర్నూలులో మానవ హక్కుల కమిషన్ పనిచేస్తుందన్నారు. తక్కువ వ్యవధిలో స్టేట్ గెస్ట్ హౌస్ లో కార్యాలయం ఏర్పాటు చేశామన్నారు. జిల్లా కలెక్టర్ మానవ హక్కుల కమిషన్ కార్యాలయం ఏర్పాటుకు చక్కని ఏర్పాట్లు చేశారన్నారు. మానవ హక్కులను ఉల్లంఘన చేస్తే ఫిర్యాదు చేయాలన్నారు. శుభ సమయంలో మానవ హక్కుల కమిషనర్ కార్యాలయం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. కోవిడ్ థర్డ్ వేవ్ నేపథ్యంలో ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపారు. మానవ హక్కుల కమిషన్ ఏర్పాటుకు సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులకు, ప్రభుత్వ అధికారులకు మరియు జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావులకు ధన్యవాదాలు తెలిపారు.
జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు, డి.ఆర్.ఓ పుల్లయ్య, జెడ్పి సీఈఓ వెంకటసుబ్బయ్య, కర్నూలు ఆర్.డి.ఓ హరిప్రసాద్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆదిశేషు నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
*కర్నూలు ఏపీ స్టేట్ గెస్ట్ హౌస్ ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ కార్యాలయం ప్రారంభం:-
-రూమ్ నెంబర్-1లో ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎం.సీతారామమూర్తి గారి ఛాంబర్
-రూమ్ నెంబర్ – 2 లో జ్యుడీషియల్ సభ్యుడు దండే సుబ్రహ్మణ్యం గారి ఛాంబర్
-రూమ్ నెంబర్ -4 లో నాన్ జ్యుడీషియల్ సభ్యుడు జి.శ్రీనివాస రావు గారి ఛాంబర్
-రిబ్బన్ కట్ చేసి ప్రారంభిస్తున్న ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎం.సీతారామమూర్తి , జ్యుడీషియల్ సభ్యుడు దండే సుబ్రహ్మణ్యం , నాన్ జ్యుడీషియల్ సభ్యుడు జి.శ్రీనివాస రావు , జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు .కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి , జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు , డి.ఆర్.ఓ పుల్లయ్య, జెడ్పి సీఈఓ వెంకటసుబ్బయ్య, కర్నూలు ఆర్.డి.ఓ హరిప్రసాద్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆదిశేషు నాయుడు, తదితరులు .
Post Comment