రఘు అరెస్టుపై టీయూడబ్ల్యూజే పిటిషన్ – రాచకొండ సీపీకి హెచ్.ఆర్.సి నోటీసు
జర్నలిస్టు గంజి రఘును పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి మానవ హక్కులను ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఈ నెల 8న, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ చేసిన ఫిర్యాదుపై శుక్రవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఈ విషయమై రాచకొండ పోలీసు కమిషనర్ కు హెచ్.ఆర్.సి. ఇవ్వాళ నోటీసు జారీ చేసిందని (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ తెలిపారు.
Post Comment