
కర్నూలు, జులై 26 :-జగనన్న కాలనీలలో 32 వేల కోట్లతో విద్యుత్, తాగునీటి పైప్లైన్, అండర్ డ్రైనేజీ, రహదారుల మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేస్తున్నామని,1200 కోట్లతో తాగునీటి వసతి, విద్యుత్, ఇంటర్నల్ రోడ్డు, అప్రోచ్ రోడ్లు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు.పేదవాడి సొంతింటి కలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నెరవేరుస్తారని,జగనన్న కాలనీలో చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
సోమవారం మధ్యాహ్నం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో పేదలందరికీ ఇళ్లు – వైయస్సార్ జగనన్న కాలనీలలో ఇంటి నిర్మాణాల పురోగతి తదితర అంశాలపై రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ లు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
జగనన్న కాలనీలలో లేవుట్ వద్దకే ఇసుక, సిమెంటు, స్టీలు లబ్ధిదారులకు అందజేసి నిర్మాణ ఖర్చు తగ్గించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి అన్నారు. అనువైన ప్రదేశాలలో అవసరమైతే భూ సేకరణ చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు మంజూరు చేయాలని జాయింట్ కలెక్టర్ ను ఆదేశించారు. కర్నూలు జిల్లా హౌసింగ్ ప్రోగ్రాంలో మొదటి, రెండవ, మూడవ స్థానంలో ఉండేలా, ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇంకా పెండింగ్లో ఉన్న భూ సేకరణను వేగవంతం చేసి యుద్ధప్రాతిపదికన అర్హులైన ప్రతిఒక్కరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలన్నారు. ఈ నెల చివరి నాటికి జగనన్న కాలనీలలో త్రాగునీరు, విద్యుత్ సౌకర్యం తదితర పనులను పూర్తిచేయాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ, ఏపీ ఎస్పీడీసీఎల్ ఎస్ ఈ లను గృహ నిర్మాణ శాఖ మంత్రి ఆదేశించారు. ఆగస్టు మొదటి వారంలో కర్నూలు జిల్లాలోని నియోజకవర్గాల్లో తాను పర్యటిస్తానన్నారు. నంద్యాలలోని పివి నగర్ లో శిథిలావస్థకు చేరుకున్న ఇండ్లను వెంటనే విజిట్ చేసి వెంటనే ప్రపోజల్ పంపాలని, వారికి కొత్త ఇళ్లు మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి 20 మంది లబ్ధిదారులకు ఒక అధికారిని, ప్రతి జగనన్న కాలనీలో లేవుట్ కు మండల స్థాయి అధికారిని నియమించినట్లు తెలిపారు. గృహనిర్మాణానికి లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు సిమెంటు, ఐరన్ అతి తక్కువ ధరకే ఇస్తున్నామన్నారు. బనగానపల్లి, ఆళ్లగడ్డ, శ్రీశైలం, పాణ్యం తదితర నియోజవర్గాల్లో ఇళ్లకు అవసరమైన చోట భూసేకరణ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికి ఏడు వందల టన్నుల స్టీల్ ను సరఫరా చేశామన్నారు. పేదవాడి సొంతింటి కలను నిజం చేసే యజ్ఞంలో ఎమ్మెల్యేలందరూ భాగస్వామ్యం అయి విజయవంతం చేయాలన్నారు.
ప్రభుత్వ విప్ – గంగుల ప్రభాకర్ రెడ్డి :-
ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అర్హులైన పేదవాళ్ళు చాలామంది ఉన్నారని, వారందరికీ ఇంటి స్థలాలు మంజూరు చేయాలన్నారు. సిరివెళ్ల మండలం మహాదేవపురంలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో పేదలకు కొన్ని గ్రామాలలో ఊరికి అవతల ఐదు కిలోమీటర్ల దూరం ఇవ్వడం వల్ల చాలామంది ఆసక్తి కనబర్చడం లేదన్నారు. ఏ ఊర్లో లబ్ధిదారులకు ఆ వూరిలోనే ఇంటి స్థలాలు మంజూరు చేయాలన్నారు. అవసరమైతే భూమి సేకరణ చేసి ఆ గ్రామంలోనే ఇంటి పట్టాలు ఇవ్వాలన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని మండలాలను Kuda పరిధిలోకి తీసుకు రావాలన్నారు.
పాణ్యం శాసనసభ్యులు -కాటసాని రాం భూపాల్ రెడ్డి :-
పాణ్యం నియోజవర్గం లో 2018 -19 సంవత్సరంలో చాలా మంది నిరుపేదలు ఇల్లు నిర్మించుకున్నారని ఆ బిల్లులు త్వరగా వచ్చేలా చూడాలన్నారు. పాణ్యం మండలంలోని ఏడు గ్రామాలు, గడివేములను Kuda పరిధిలోకి తీసుకు రావాలన్నారు. కల్లూరు మండలం జగన్నాథ గట్టు లో చాలా మందికి ఇంటి పట్టాలు ఇచ్చారని అక్కడ ఇంటి నిర్మాణాలు చేపట్టారని ,రోడ్లు కరెంటు త్రాగు నీటి వసతి లేక ఎవరు వెళ్లడానికి ఆసక్తి కనబరచడం లేదన్నారు. పందిపాడు లో 3,600 మందికి పట్టాలు ఇచ్చారని, అక్కడ కరెంటు ఇవ్వకపోవడం వల్ల ఎవరు ఇళ్లు నిర్మించుకో లేదని, అక్కడ వెంటనే కరెంట్ సౌకర్యం కల్పించి ఇళ్లను నిర్మించుకునే లా చర్యలు చేపట్టాలన్నారు. పాణ్యం నియోజవర్గంలో ఏ ఊర్లో వాళ్లకు అక్కడే ఇంటి స్థలాలు మంజూరు చేయాలన్నారు. గత ప్రభుత్వంలో పేదలకు ఇళ్లు మంజూరయ్యాయనీ, అవి పలు స్టేజ్ ల్లో నిలిచిపోయాయనీ,… వాటికి నిధులు కేటాయించి త్వరగా వారికి బిల్లులు వచ్చేలా చూడాలన్నారు.
శ్రీశైలం శాసనసభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి :-
శ్రీశైలంలో 2017 -18 సంవత్సరంలో BLC కింద నాలుగు వేల నాలుగు వందలు ఇళ్లు అలాట్ అయ్యాయని వాటినీ కన్వర్షన్ చేసి వారికి కొత్త ఇళ్లు చేయాలి. శ్రీశైలం నియోజకవర్గం లోని శ్రీశైలం, బండి ఆత్మకూరు, మహానంది, వెలుగోడు మండలాలను kuda పరిధిలోకి చేర్చాలి. ఒక గ్రామంలో ఉన్న వాళ్లకు వేరొక గ్రామంలో ఇంటి స్థలాలు ఇవ్వకూడదన్నారు శ్రీశైలంలో నిరుపేదలకు ఇంటి స్థలాలు మంజూరు చేసేందుకు అవసరమైతే ప్రభుత్వ భూమిని కొనుగోలు చేసి ఇంటి పట్టాలు మంజూరు చేయాలి. తమ నియోజకవర్గంలో ఇసుక సమస్య ఎక్కువగా ఉంది. ఆ సమస్యను పరిష్కరించాలి. వాగులు, వంకల నుంచి ఇసుక తెచ్చుకున్నా కూడా ఒక చోట ఇసుక నిల్వ చేసుకుంటే సెబ్ అధికారులు దాడులు చేసి సీజ్ చేస్తున్నారు. అలా చేయడం మంచిది కాదు. అక్రమంగా ఇసుక తరలిస్తే కచ్చితంగా చర్యలు తీసుకోవాలి. జగనన్న కాలనీలలో ఇంటి నిర్మాణాలు చేపట్టడానికి యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ సౌకర్యం కల్పించాలి. పేదవాళ్ళు కాలనీలలో ఇల్లు కట్టుకుంటూ ఉంటే కొంతమంది సిమెంట్ బస్తాలు, నీళ్ల ట్యాంకర్లను చోరీ చేస్తున్నారు. అలాకాకుండా వాచ్ మెన్ ను నియమించేలా చర్యలు చేపట్టాలి. కోర్టు కేసులు త్వరగా పరిష్కరించి అర్హులైన వారందరికీ త్వరగా ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలన్నారు. వెలుగోడు లో 35 వేల జనాభా ఉంది, మూడు వేల ఇల్లు ఇవ్వాల్సి ఉంది, అక్కడ వెంటనే భూసేకరణ చేసైనా ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు.
పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి :-
వెల్దుర్తి లేవుట్ అప్రోచ్ రోడ్డు కోసం 40 లక్షల రూపాయలు మంజూరు చేయాలన్నారు. తుగ్గలి, వెల్దుర్తి మండలం లో అర్హులైన పేదలు చాలామంది ఉన్నారని, వారికి వెంటనే ఇంటి పట్టాలు ఇచ్చేందుకు కావలసిన భూమిని వెంటనే భూసేకరణ చేయాలన్నారు. తుగ్గలి మండలం లోని జొన్నగిరి గ్రామంలో అర్హులు ఉన్నారు, ప్రభుత్వ స్థలాలు లేవు, భూమిని కొనుగోలు చేసి అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలి. మద్దికేర లో కోర్టు సమస్య ఉంది, కోర్టు సమస్యలు వెంటనే పరిష్కరించేల చర్యలు చేపట్టాలి. జగనన్న హౌసింగ్ కాలనీలకు ఇసుక సమస్య కలదు. చిన్నచిన్న ఇసుక రిచ్ లను ఓపెన్ చేసి వాగులు వంకలు లో ఇసుకను తవ్వుకునే విధంగా అధికారులు పర్మిషన్ ఇవ్వాలి.
నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ :-
నంది కొట్కూరు నియోజవర్గం లోని తలముడిపి, ఎర్ర గూడూరు, చింతలపల్లి తదితర గ్రామాలలో చాలా దూరంలో ఇంటి పట్టాలు ఇవ్వడం వల్ల చాలామంది ఆసక్తి చూపటం లేదు. తమ నియోజకవర్గం లో కోర్టు కేసులు సంబంధించిన ఉన్నాయిని వాటిని త్వరగా పరిష్కరించాలన్నారు. గత ప్రభుత్వంలో హౌసింగ్ ప్రోగ్రాంలో ఒక రూపాయి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారని, ఆ తర్వాత డబ్బులు జమ చేయకపోవడం వల్ల, వాళ్లు ఇల్లు కట్టుకో లేకపోయారు అని, ఇప్పుడు కొత్త ఇంటికి అప్లై చేస్తూ ఉంటే ఇంతకు ముందే ఇల్లు ఉన్నట్లు చూపిస్తుందని, అలాంటి వారి సమస్యలు పరిష్కరించాలన్నారు.
ఏ ఊరులో ఉన్న వాళ్లకు ఆ ఊర్లోనే ఇంటి స్థలాలు మంజూరు చేయాలి.
కోడుమూరు శాసనసభ్యులు డాక్టర్ జె.సుధాకర్ :-
కోడుమూరు నియోజవర్గం అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతమని, జగనన్న కాలనీలలో తొమ్మిది వేల ఇళ్ల పట్టాలు ఇవ్వడం శుభపరిణామమన్నారు. కోడుమూరు నియోజకవర్గంలోని ఆర్కే దుద్యాల, ఎదురురు గ్రామాలలో ఇంటి పట్టాలు అర్హులైన నిరుపేదలకు ఇవ్వలేదు. తుంగభద్ర నది ఒడ్డున 12 గ్రామాల నివాసులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి. బి తాండ్రపాడు లో వైఎస్ఆర్ హయాంలో గృహాలు నిర్మించారు. వాటికి మౌలిక వసతులు కలిపిస్తే పదివేల మందికి ఇల్లు ఇచ్చిన వాళ్లమవుతాం అన్నారు. పులకుర్తి, పెంచికలపాడు, మునగల పాడు, పోలకల్, గుడిపాడు, చనుగొండ్ల గ్రామాలలో అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలు మంజూరు చేయాలి. పాలకొల్లులో 12 వేల జనాభా ఉంది. ఆ గ్రామంలో అత్యధికంగా ఎస్సీ వాళ్ళు నివసిస్తున్నారు. చాలామంది పేద వారున్నారు.. అర్హులై ఉండి ఇంటి స్థలం లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండి ఇంటి స్థలం మంజూరు చేయాలి.
*బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి :-
బనగానపల్లె నియోజకవర్గంలోని బనగానపల్లి, అవుకు, సంజామల కోయిలకుంట్ల 5 మండలాలను Kuda పరిధిలోకి చేర్చాలి. బనగానపల్లిలో 3,800 ఇంటి పట్టాలు కోర్టు కేసులు ఉన్నాయి. తమ నియోజకవర్గంలో చాలామంది అర్హులు ఉన్నప్పటికీ ప్రభుత్వ స్థలం లేకపోవడం వల్ల భూమి సేకరణ చేయకపోవడంతో చాలామంది అర్హులు ఇంటి స్థలాలు పొందలేక ఉన్నారు. . ప్రభుత్వం ఎన్ని కోట్లు ఖర్చు అయినా పర్వాలేదు… భూ సేకరణ చేసి అర్హులైన వారందరికీ ఇంటి పట్టాలు పంపిణీ చేయాలని దృఢనిశ్చయంతో ఉన్నారు. ఆ దిశగా బనగానపల్లి నియోజకవర్గంలో వెంటనే భూసేకరణ చేపట్టి ఇంటి పట్టాలు మంజూరు చేయాలి. ప్రభుత్వ భవన నిర్మాణాలు, తదితర వాటి కోసం నెల్లూరు నుంచి ఇసుక తెచ్చుకుంటున్నామని, బనగానపల్లె నియోజకవర్గం బార్డర్ ఏరియా అని, తమకు కడప జిల్లాలోని జమ్మలమడుగు 60 కిలోమీటర్ల దూరంలోని ఇసుక లభ్యమవుతుందని, అక్కడి నుంచి ఇసుక సరఫరాకు చర్యలు చేపట్టాలన్నారు.
జిల్లాలో ఏ మండలాలు అయితే kuda పరిధిలోకి రాలేదో వాటిని వెంటనే చేర్చాలన్నారు.
: ఆళ్లగడ్డ శాసన సభ్యులు గంగుల బ్రిజేంద్ర రెడ్డి ;
ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ఆరు మండలాలను kuda పరిధిలోకి తీసుకురావాలి. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో గతంలో నిర్మించుకున్న గృహ నిర్మాణాలు సంబంధించిన బిల్లులు 12 కోట్లు పెండింగ్ ఉన్నాయని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. మహాదేవ పురం, రుద్రవరం, చాగలమర్రి, ముత్యాలపాడు అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు మంజూరు చేసేందుకు భూమి కొనుగోలు చేసి ఇంటి పట్టాలు పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలి. సిరివెళ్ల మండలంలోని మహాదేవపురం లో పేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేశారు. ఎవరు కూడా ఆసక్తి చూపలేదు. ఆళ్లగడ్డ సమీపం 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న కడప నుంచి ఇసుక తెచ్చుకునే విధంగా వెసులుబాటు కల్పించాలి.
నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి :-
నంద్యాలలో దాదాపు 9వేల ఇల్లు మంజూరు అయ్యాయి. అందులో దాదాపు ఎనిమిది వేలు కోర్టు కేసుల వల్ల ఆగిపోయాయి… కోర్టు కేసులను సత్వరమే పరిష్కరించి వెంటనే ఇళ్ల పట్టాల పంపిణీకి చర్యలు చేపట్టాలి. గతంలో నంద్యాల సమీపంలో పేదలు ఇల్లు నిర్మించుకుని ఉంటే ఆ ఇండ్లను పగలగొట్టి ఆ స్థలాన్ని ఖాళీ చేయించి టిడ్కో ఇంటి నిర్మాణం గతంలో చేపట్టారు. వాళ్లు ఇప్పుడు ల కాలనీలకు దరఖాస్తు చేసుకుంటే ఇన్ ఎలిజిబుల్ వస్తుంది. సుమారు వెయ్యి మంది దాకా ఉన్నారు… వారందరికీ కూడా ఇళ్ల పట్టాల పంపిణీ చేయాలి. పీవీ నగర్ లోని గృహాలు 90% శిధిలావస్థకు చేరుకున్నాయి. రోడ్డు రెండు అడుగుల పైన ఉంటే గృహాలు కింద ఉన్నాయని, అదే స్థలంలో ఇల్లు ఇచ్చి కట్టించాలన్నారు. Kuda లో ఐదు గ్రామాలు ఉన్నాయి, రెండు మండలాలను కూడా kuda పరిధిలోకి తీసుకురావాలన్నారు.
*జగనన్న కాలనీలలో ఇంటి నిర్మాణాలు శరవేగంగా జరగాలి – రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ :-
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు పేదలందరికీ ఇల్లు జగనన్న కాలనీలలో ఇంటి నిర్మాణాలు శరవేగంగా జరగాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అధికారులకు ఆదేశించారు. ఇంకా పెండింగ్లో ఉన్న తాగు నీటి వసతి, విద్యుత్ సౌకర్యం పనులను వేగవంతం చేసి లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణానికి అధికారులు కృషి చేయాలన్నారు. లబ్ధిదారులకు అండగా నిలుస్తూ ఇంటి నిర్మాణానికి కావలసిన సామాగ్రిని తక్కువ ధరకే సిమెంటు, ఇనుము అందజేయడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో ఇసుక కొరత రాకుండా ఉండేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి అన్ని లేఅవుట్లలో ఇసుకను నిల్వ చేయాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేర్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయాన్ని అందరం కలిసికట్టుగా పనిచేసి నేరవేద్దామన్నారు.
కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ :-
దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జగన్నాథ గట్టు పై గృహాలు ఇచ్చారని, వాటికి మౌలిక వసతులు కల్పించి నివాసయోగ్యంగా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. గతంలో ఇండ్ల కోసం 2100 వంద రూపాయలు డిపాజిట్ చేశారని, వారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలన్నారు.