
కర్నూలు, జూలై 20:- పేదల సొంతింటి కల నెరవేర్చడంలో ఎంతో సంతృప్తి ఉంటుందని హౌసింగ్ అధికారులు సిబ్బంది నవరత్నాలు పేదలందరికీ ఇల్లు ఈ క్రమాన్ని సీరియస్‌గా తీసుకొని ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) నారపు రెడ్డి మౌర్య ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంపై హౌసింగ్ ఈఈలు, డిఈలు, ఏఈ లు, వర్క్ ఇన్స్పెక్టర్లు తో రివ్యూ మీటింగ్ నిర్వహించారు.
నారపురెడ్డి మౌర్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పేదలందరికీ ఇల్లు కార్యక్రమాన్ని వేగవంతం చేసి పూర్తి చేయాలన్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమం రాష్ట్రంలోనే కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉండేందుకు హౌసింగ్ అధికారులు సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేసి లక్ష్యాన్ని నెరవేర్చాలన్నారు. ఏఈలు వర్క్ ఇన్స్పెక్టర్లు ఫీల్డ్ విజిట్ చేసి మొత్తం ఇళ్లన్నీ జియో ట్యాగింగ్ చేయాలన్నారు. తొలుత ఇళ్ల నిర్మాణాలపై ఆసక్తి చూపుతున్న లబ్ధిదారుల ఇళ్లను పూర్తిచేసి మిగతా ఇళ్లు కూడా త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా హౌసింగ్ లబ్ధిదారులు అందరికీ జాబ్ కార్డులు పంపిణీ చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణాలలో మంత్రాలయం, నందికొట్కూరు, ఆదోని ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయని ఇక్కడ ఏఈలు డీలు సమస్యలు గుర్తించి వెంటనే తమకు తెలియజేయాలన్నారు. ఇల్లు ఏ ఏ స్టేజిలో ఉందో గుర్తించి వెంటనే పేమెంట్ జనరేట్ చేయాలన్నారు. ప్రభుత్వం పేదలకు నిర్మించే ఇళ్ళకు క్వాలిటీ మెటీరియల్ వాడాలన్నారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి అడ్వాన్స్‌గా మెటీరియల్ తెప్పించుకోవాలన్నారు. వంకలు వాగులలోదొరికే ఇసుక ఇంటి నిర్మాణాలకు వాడకూడదని క్వాలిటీ ఇసుక మాత్రమే వాడాలన్నారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్లు అడిగిన వెంటనే ఇసుక టోకెన్లు ఇవ్వాలన్నారు. లబ్ధిదారుల స్థలాల కోర్టు కేసుల జాబితా తయారు చేసి పంపాలన్నారు. కరెంటు, సిమెంటు, స్టీలు,ఇసుక వంటి సమస్యలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. ఈ సందర్భంగా డివిజన్ల వారీగా ఇళ్ల నిర్మాణాలపై రివ్యూ నిర్వహించారు. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమాన్ని హౌసింగ్ అధికారులు సిబ్బంది ఒక ఛాలెంజ్ గా తీసుకుని విజయవంతం చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో హౌసింగ్ పిడి వెంకటరమణ, హౌసింగ్ ఈ ఈ లు, డి ఈ లు, ఏఈ లు, వర్క్ ఇన్స్పెక్టర్ లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ లు తదితరులు పాల్గొన్నారు.