జెర్మన్ హేంగర్ల తాత్కాలిక ఆసుపత్రిలో విధులు నిర్వహించడానికి మ్యాన్ పవర్ సిద్ధం చేసుకోవాలి- ఇంఛార్జి కలెక్టర్

నంద్యాల ,మే 19:-నంద్యాల జిల్లాస్థాయి ఆస్పత్రి ఆవరణంలో ని ఖాళీ స్థలంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు   కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సదుపాయం కోసం,  అదనపు బెడ్స్ కల్పించేందుకు  అన్ని వసతులతో కూడిన జెర్మన్ హేంగర్ల తాత్కాలిక ఆసుపత్రి నిర్మాణ ఏర్పాట్ల పనులను పరిశీలించామని  జిల్లా ఇంఛార్జి కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి తెలిపారు .

బుధవారం  జెర్మన్ హేంగర్ల తాత్కాలిక ఆసుపత్రి నిర్మాణ ఏర్పాట్ల పనులను జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్యాంసుందర్ రెడ్డి,జెసి (ఆసరా & సంక్షేమం) శ్రీనివాసులు, నంద్యాల సబ్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి, నంద్యాల జిల్లా స్థాయి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయ్ కుమార్, డి సి హెచ్ ఎస్ రామకృష్ణతో కలిసి పరిశీలించారు.

ఎస్. రామసుందర్ రెడ్డి మాట్లాడుతూ  ఈరోజు నంద్యాల పట్టణంలోని జిల్లాస్థాయి ఆస్పత్రి ఆవరణలో,  నంద్యాల శివార్లలోని కోవిడ్ కేర్ సెంటర్ల లో జెర్మన్ హేంగర్ల తాత్కాలిక ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించామని, ఈ పనులను కూడా వేగవంతంగా చేయాలని కాంట్రాక్టర్లను,  సంబంధిత అధికారులను కూడా ఆదేశించామన్నారు. కోవిడ్ బాధితుల కోసం జర్మన్ షెడ్స్ లో అన్ని రకాల సౌకర్యాలతో బెడ్స్, ఏసీ, వాటర్, మందులు, పవర్ సప్లై, శానిటేషన్, ఆక్సీజన్ బెడ్స్ తదితర ఏర్పాట్ల పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించా మన్నారు.జెర్మన్ హేంగర్ల తాత్కాలిక ఆసుపత్రిలో విధులు నిర్వహించడానికి మ్యాన్ పవర్ సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ విజయ్ కుమార్,  యు.జి.సి హెచ్ ఎస్ రామకృష్ణ ను ఆదేశించారు.వీరి వెంట మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ, నంద్యాల తహసీల్దార్ రవికుమార్ తదితరులు ఉన్నారు.

*ఈ రోజు ఉదయం కర్నూలు  సంక్షేమ భవన్‌లో జిల్లా వెనుక బడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ భగీరథ మహర్షి జయంతి సందర్భంగా  శ్రీ భగీరథ మహర్షి చిత్రపటానికి  జిల్లా ఇంఛార్జి కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి, జెసి (ఆసరా & సంక్షేమం) శ్రీనివాసులు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.  జిల్లా బిసి సంక్షేమ అధికారి వెంకటలక్ష్మి,బిసి కార్పొరేషన్ ఈడి శిరీష, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ చంద్రశేఖర్, బీసీ సంక్షేమ శాఖ సిబ్బంది, తదితరులు నివాళులర్పించారు.

*స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ కంటి హాస్పిటల్ లో  జగనన్న మైల్డ్ కేర్ కోవిడ్ సెంటర్ ను  పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రారభించారు .కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కర్నూలు నగర మున్సిపల్ మేయర్ బి వై రామయ్య, మున్సిపల్ కమిషనర్ డికె బాలాజీ , డాక్టర్లు పాల్గొన్నారు

* కర్నూలు నగరంలోని ప్రభుత్వ ప్రాంతీయ కంటి హాస్పిటల్ లో  జగనన్న మైల్డ్ కేర్ కోవిడ్ సెంటర్ ను కర్నూలు నగర ఎమ్యెల్యే ఎం.ఏ.హఫీజ్ ఖాన్  ఆధ్వర్యంలో, జలవనరుల శాఖా మంత్రి పి అనిల్ కుమార్ యాదవ్  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ,, కర్నూలు నగర మేయర్ బి.వై.రామయ్య ,కమిషనర్ .డి.కె.బాలాజీ , సంబంధిత డాక్టర్లు   పాల్గొన్నారు.

*కలెక్టరు  ఆదేశాల ప్రకారం, జిల్లా ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ సహకారంతో ఈ రోజు కర్నూల్ టౌన్ లో పనిచేస్తున్న 45 సంవత్సారాలు  దాటిన బ్యాంక్ సిబ్బంది కి ప్రత్యేక వాక్సినేషన్ ప్రోగ్రామ్ నిర్వహించించారు.ఈ ప్రోగ్రామ్ ని డీసీసీబీ బ్యాంక్ అవరణంలో నిర్వహించారు. సుమారు 200 మంది బ్యాంక్ సిబ్బంది  వాక్సినేషన్ వేయించుకున్నారని  జిల్లా లీడ్ బ్యాంక్ అధికారి వై. వెంకట నారాయణ చెప్పారు. ఇంకా ఎవరైనా  వుంటే  సమీపం లోని వాక్సినేషన్ సెంటర్ కి వెళ్ళి బ్యాంక్ ఐడీ ప్రూఫ్,ఆధార్ కార్డ్ చూపించి వాక్సినేషన్ వేయించుకోవాలని కోరారు . ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ సీఈఓ పి. రామాంజనేయులు,జోహరపురం 1 మెడికల్ ఆఫీసర్ శ్రీ లక్ష్మి,  సిబ్బంది,బ్యాంక్ అధికారులు  సిబ్బంది పాల్గొన్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.