శ్రీశైల దేవస్థానం: కరోనా వ్యాప్తి కట్టడికి, అందరికీ ఆయురారోగ్యాలు సంకల్పంతో శ్రీశైల దేవస్థానం హోమాలు నిర్వహించ తలపెట్టింది. ఈ నెల 23 నుంచి ప్రత్యేకంగా పలు హోమాలను నిర్వహించనున్నది. ఏడురోజులపాటు ఈ హోమాలు జరుగుతాయి. మృత్యుంజయహోమం, ధన్వంతరి హోమం, ఆయుష్య హోమం, శీతలాదేవి హోమాలు నిర్వహిస్తారు.
మృత్యుంజయ హోమం, ధన్వంతరి హోమం, ఆయుష్య హోమాలు స్వామివారి యాగశాలలో ఉదయం 10గంటల నుంచి జరుపుతారు. శీతలాదేవి హోమం అమ్మవారి యాగశాలలో సాయంత్రం 6.30గంటల నుంచి నిర్వహిస్తారు.
ప్రస్తుతానికి ఏడు రోజులపాటు ,ఆ తరువాత మరో వారం రోజుల విరామంతో తిరిగి ఈ హోమాలు నిర్వహిస్తారు.
కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అర్చకస్వాములు, వేదపండితులు జాగ్రత్తలతో ఈ విశేష హోమాలను నిర్వహిస్తారు.