హైదరాబాద్, డిసెంబర్ 22:మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 2202 దరఖాస్తులు అందాయని అధికారులు తెలిపారు.
ఈ రోజు నిర్వహించిన ప్రజా వాణిలో ఎక్కువగా 40 శాతం మేరకు డబుల్ బెడ్ రూమ్, 30 శాతం మేరకు పెన్షన్ లకు సంబంధించినవి కాగా, మిగిలినవి ఉద్యోగాలు, రెవెన్యూ సమస్యలు పరిష్కారం కోసం దరఖాస్తులు చేసుకున్నారని ప్రజా భవన్ అధికారులు తెలిపారు.