
శ్రీశైల దేవస్థానం:శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా) ఈరోజు (25.12.2021) వై.జయకృష్ణ, మైదుకూరు బృందం తులసీ జలంధర హరికథ కార్యక్రమం సమర్పించింది.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వద్ద ఈ రోజు సాయంకాలం గం.6:00 ని||ల నుండి హరికథ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి హర్మోనియం సహకారాన్ని ఎం. రమేష్, అందించగా, ఎం. మురళీ తబలా సహకారాన్ని అందించారు..
రెండవ కార్యక్రమంగా శ్రీ నటరాజ నృత్య కళాశాల,నందికొట్కూరు వారు సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.
ఈ కార్యక్రమం లో మూషికవాహన, బ్రహ్మాంజలి, శంభో…శివశంబో, శివతాండవం, అఖిలాండేశ్వరి, నందివాహన తదితర గీతాలకు సాయికుమార్, జయతి, పూజిత, నందిని, గీతిక, కర్ణి తదితరులు నృత్య ప్రదర్శనను చేశారు.
రేపటి నిత్య కళారాధన
రేపు (26.12.2021) దుర్గాభవాని నృత్య నిలయం, విజయవాడ వారు సంప్రదాయ నృత్య ప్రదర్శన, బి. ఆనంద్, హైదరాబాద్ బృందం బుర్రకథ కార్యక్రమం సమర్పిస్తాయి.