
శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమం ) బుధవారం వై.రమణయ్య భాగవతార్, ప్రొద్దుటూరు, కడప జిల్లా భూకైలాస్ పై హరికథా గానం చేసారు.ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వద్ద సాయంకాలం ఈ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి తబల సహకారాన్ని ఎం. పవన్ కుమార్ అందించగా వై శ్రీనివాసరాజు హార్మోనియం సహ కారాన్ని అందించారు.
గురువారం కిరణ్ కుమార్, జనగాం బృందం సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పిస్తుంది.