
శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా నిత్య కళారాధన కార్యక్రమంలో ఈరోజు (15.12.2021) శ్రీమతి కె. ప్రమీల భాగవతారిణి, కడప జిల్లా బృందం భక్తమార్కండేయ చరిత్ర గురించి హరికథ కార్యక్రమం సమర్పించారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వద్ద ఈ రోజు సాయంకాలం గం.6:00 ని||ల నుండి హరికథ కార్యక్రమం ఏర్పాటు అయింది.
ఈ హరికథ కార్యక్రమానికి తబల సహకారాన్ని బి.వెంకటేశ్వర్లు , హార్మోనియం సహకారాన్ని జి.బాబు అందించారు.
రేపటి నిత్య కళారాధన
రేపు (16.12.2021) కె. సుధాకర్, కర్నూలు బృందం మృదంగం కార్యక్రమం సమర్పిస్తారు.