శ్రీశైల దేవస్థానం:దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమం) మంగళవారం శ్రీమతి కె. లక్ష్మీమహేష్ భాగవతారిణి, కర్నూలు శివలీలలు హరికథా గానం చేసారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వద్ద సాయంకాలం నుండి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసారు.
( బుధవారం నిత్య కళారాధన |
25న శ్రీ సంగీత సిస్టర్ అండ్ గ్రూప్ , హైదరాబాద్ సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం వుంటుంది.
25న హనుమజ్జయంతి:
వైశాఖ బహుళ దశమిని పురస్కరించుకుని 25న పాతాళగంగ మార్గంలోని శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయంలో హనుమజ్జయంతి ఉత్సవం నిర్వహిస్తారు.
ఉదయం 9గంటలకు వేదపండితులు, అర్చక స్వాములు లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠిస్తారు. కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని ముందుగా మహాగణపతిపూజ చేస్తారు.
శ్రీ ఆంజనేయస్వామివారికి శ్రీమన్యుసూక్త పారాయణ సహిత అభిషేకం , నాగవల్లి దళార్చన, పుష్పార్చన, నీరాజన మంత్రపుష్పములు నిర్వహిస్తారు.