భక్తమార్కండేయ హరికథ గానం, దత్తాత్రేయస్వామివారికి విశేషపూజలు

శ్రీశైల దేవస్థానం:లోకకల్యాణంకోసం దేవస్థానం గురువారం  ఆలయ ప్రాంగణంలోని త్రిఫలవృక్షం క్రింద నెలకొని ఉన్న శ్రీ దత్తాత్రేయస్వామివారికి విశేషపూజలను నిర్వహించింది.

ప్రతి గురువారం దేవస్థానసేవగా (సర్కారీసేవగా) ఈ కైంకర్యం నిర్వహిస్తున్నారు.

ఈ పూజాకార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతిపూజను జరిపారు. ఆ తరువాత దత్తాత్రేయస్వామివారికి పంచామృతాభిషేకం, విశేష పూజలు జరిపారు.

లోకోద్ధరణకోసం  బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకే స్వరూపములో దత్తాత్రేయునిగా అవతరించారు. అందుకే త్రిమూర్తి స్వరూపునిగా దత్తాత్రేయుడు ప్రసిద్ధుడు.

 శ్రీశైలక్షేత్రానికి దత్తాత్రేయుల వారికి ఎంతో దగ్గర సంబంధం ఉంది.

ఆలయ ప్రాంగణంలోని త్రిఫలవృక్షం క్రింద దత్తాత్రేయులవారు తపస్సు చేశారని ప్రతీతి. అందుకే ఈ వృక్షానికి దత్తాత్రేయ వృక్షమని పేరు.

*సాంస్కృతిక కార్యక్రమాలు-

దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) ఈరోజు  శ్రీమతి కె. ప్రమీలరాణి, భాగవతారిణి, రాయచోటి, అన్నమయ్య జిల్లా  భక్తమార్కండేయ హరికథ గానం చేశారు.

ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ హరికథ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమములో హార్మోనియం సహకారాన్ని పి. అయ్యప్ప, మృదంగ సహకారాన్ని  ఎన్. బాబురావు అందించారు.

కాగా శ్రీ స్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని , ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ  కార్యక్రమాలు జరుగుతున్నాయి.

print

Post Comment

You May Have Missed