శ్రీశైల దేవస్థానం:దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా( నిత్యకళారాధన కార్యక్రమం) బుధవారం కొండపల్లి ఉదయ్ కుమార్ భాగవతార్, కడప విరాటపర్వం హరికథ గానం చేసారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని విత్యకళారాధన వేదిక వద్ద సాయంకాలం ఈ హరికథ కార్యక్రమం జరిగింది.
కార్యక్రమం లో తబల సహకారాన్ని కె.సి. నటరాజు, హార్మోనియం సహకారాన్ని కె. నాగభూషణం అందించారు.
శ్రీ స్వామి అమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని, ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ ధర్మపథం కార్యక్రమాలు జరుగుతున్నాయి.