శ్రీశైల దేవస్థానం:హనుమజ్జయంతి సందర్భంగా ఈ రోజు (04.06.2021)న శ్రీ ఆంజనేయస్వామివారికి విశేష పూజలు జరిగాయి. శ్రీశైలంలోని పాతాళగంగమార్గంలో శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయంలో ఈ ప్రత్యేక పూజలు చేసారు.
లోక కల్యాణం కోసం జరిపిన ఈ విశేషపూజలలో భాగంగా ముందుగా దేశం శాంతి సౌభాగ్యాలలో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడిపంటలతో తులతూగాలని, జనులందరికి ఆయురారోగ్యాలు కలిగి, వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్ని, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, అన్ని సామాజిక వర్గాలు సుఖ శాంతులతో ఉండాలని అర్చకులు సంకల్పాన్ని చెప్పారు.
తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతిపూజ చేసారు.
అనంతరం ఆంజనేయస్వామి వారికి ఆయా సూక్తలతో పంచామృతాభిషేకం, జలాభిషేకం చేసారు. తరువాత స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పుష్పార్చన, నాగవల్లి దళపూజ (ఆకుపూజ), వడమాల సమర్పణ చేసారు.
*Ankaalamma special puuja,Uuyala seva performed in temple today.