×

జూన్ 1న పాతాళగంగ మార్గంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమజ్జయంతి ఉత్సవం

జూన్ 1న పాతాళగంగ మార్గంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమజ్జయంతి ఉత్సవం

శ్రీశైలదేవస్థానం:వైశాఖ బహుళ దశమిని పురస్కరించుకుని జూన్ 1న పాతాళగంగ మార్గంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమజ్జయంతి ఉత్సవం నిర్వహిస్తారు.

ఉదయం 8.30 గంటలకు వేదపండితులు, అర్చక స్వాములు లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ ముందుగా జయంత్యోత్సవ సంకల్పాన్ని పఠిస్తారు. తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ జరుగుతుంది.

తరువాత శ్రీఆంజనేయస్వామివారికి శ్రీమన్యుసూక్త పారాయణ సహిత అభిషేకము, నాగవల్లి దళార్చన, పుష్పార్చన, నీరాజన మంత్రపుష్పములు నిర్వహిస్తారు.

print

Post Comment

You May Have Missed