నయనానందకరంగా హంస వాహన సేవ

 శ్రీశైల దేవస్థానం:మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా ఆదివారం  కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు  అన్నప్రసాద వితరణ, పలు పార్కింగు ప్రదేశాలు, ప్రధాన కూడళ్ళు మొదలైన వాటిని పరిశీలించారు.

ఈ సందర్భంగా అన్నదాన భవనములోని అన్నదాన ప్రదేశాలు, భక్తులు వేచి వుండే గదులు, వంటశాల మొదలైన వాటిని పరిశీలించారు. అదేవిధంగా ఈ రోజు వండిన వంటకాలను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఈ ఓ  మాట్లాడుతూ ఉత్సవాలలో   రద్దీని అనుసరించి వంటకాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.ముఖ్యంగా భక్తులు అధికసమయం వేచివుండకుండా తగు ప్రణాళికతో ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలను అందజేస్తుండాలన్నారు. అన్నప్రసాద భవనాన్ని, వంటశాలను తరుచుగా శుభ్రపరుస్తూ శుచిశుభ్రతలను పాటిస్తుండాలన్నారు.

ఉత్సవాల సమయములో క్షేత్రపరిధిలో పలుచోట్ల స్వచ్ఛంద సేవాకర్తలు కూడా అన్నదానాన్ని చేయడం జరుగుతున్నదని, అటువంటి సంస్థలకు దేవస్థానం నుంచి పూర్తి సహాయ సహకారాన్ని అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

తరువాత యజ్ఞవాటిక, గణేశసదన్, విభూతిమఠం, ఆగమపాఠశాల మొదలైన చోట్ల ఏర్పాటు చేసిన పార్కింగు ప్రదేశాలను పరిశీలించారు. అన్ని పార్కింగు ప్రదేశాలలో కూడా నిరంతరం మంచినీటి సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలని నీటిసరఫరా విభాగాన్ని ఈ ఓ  ఆదేశించారు.అనంతరం టోల్ గేట్ కూడలి, మల్లికార్జునసదనం కూడలి, వైద్యశాల కూడలి మొదలైన ప్రాంతాలను పరిశీలించారు. అన్ని కూడళ్ళ వద్ద ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీస్ శాఖ వారి సమన్వయంతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని భద్రతా విభాగం పర్యవేక్షకులను ఆదేశించారు.

ముఖ్యంగా అన్ని కూడళ్ళలోనూ, రద్దీ ప్రదేశాలలోనూ విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బంది పోలీస్ సిబ్బంది సమన్వయంతో ఎప్పటికప్పుడు పాదాచారులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. కంట్రోల్రూమ్లో విధులు నిర్వహిస్తున్న అధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించుకుంటూ సంబంధిత విభాగాలను అప్రమత్తం చేస్తూ సమన్వయంతో విధులు నిర్వహిస్తుండాలన్నారు.

  • మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా నాల్గవ రోజైన రేపు (04.03.2024) శ్రీ స్వామిఅమ్మ వార్లకు విశేషపూజలు
    • రేపు ( 04.03.2024) సాయంకాలం మయూర వాహనసేవ
    • లోక కల్యాణం కోసం రుద్రహోమం, చండీహోమం, జపాలు, పారాయణలు
    • రేపు ( 04.03.2024) సాయంత్రం శ్రీస్వామిఅమ్మవార్లకు తిరుమల తిరుపతి దేవస్థానం తరుపున శ్రీ స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పణ
    • రేపు ( 04.03.2024) సాయంకాలం శ్రీస్వామిఅమ్మవార్ల గ్రామోత్సవం
    • గ్రామోత్సవంలో పలు సంప్రదాయ జానపద కళారూపాల ప్రదర్శన
    • ఆలయ దక్షిణమాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ధ, పుష్కరిణి వేదిక వద్ద, శివదీక్షా శిబిరాల వేదిక వద్ద సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ
    • 05.03.2024 కాణిపాకం దేవస్థానం వారిచే పట్టువస్త్రాల సమర్పణ
  • *దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం వారిచే ఆదివారం పట్టు వస్త్రాల సమర్పణ

print

Post Comment

You May Have Missed