శ్రీశైల దేవస్థానం:ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం గం. 3.00లకు జరగనున్న సమావేశంలో మంత్రుల బృందం స్థానిక నంద్యాల పార్లమెంట్ సభ్యులు , శ్రీశైలం శాసనసభ్యులతో కలసి మహాశివరాత్రి ఏర్పాట్లను సమీక్షించనున్నది. అన్నప్రసాద వితరణ భవన సముదాయం వద్ద కమాండ్ కంట్రోల్ రూములో ( సిసి కంట్రోల్ రూము) ఈ సమావేశం జరుగుతుంది.
రాష్ట్ర ఆర్థికమంత్రి, నంద్యాల జిల్లా ఇంఛార్జి మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్, హోంశాఖామంత్రి శ్రీమతి వి. అనిత, న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖామంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్, రోడ్లు, భవనాలు, మౌలిక వసతుల శాఖామంత్రి బి. సి.జనార్థన్ రెడ్డి ఆయా ఏర్పాట్లను సమీక్షించనున్నారు.
ఈ సమావేశంలో స్థానిక పార్లమెంట్ సభ్యులు డా. బైరెడ్డి శబరి, స్థానిక శాసనసభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి కూడా పాల్గొంటారు.
అదేవిధంగా ఈ సమావేశంలో రాష్ట్రదేవదాయశాఖ కార్యదర్శి, కమిషనర్, జిల్లా కలెక్టర్, జిల్లాలోని పలు శాఖల అధికారులు కూడా పాల్గొననున్నారు.