
*ఉత్తీర్ణత సాధించిన 50మంది బాలికలు, 48మంది బాలురు*
*అభినందించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి, ప్రిన్సిపల్ కార్యదర్శి, ఎంజెపి సోసైటీకార్యదర్శి*
దేశవ్యాప్తంగా మొదటి విడతలో జరిగిన జెఇఇ మెయిన్ ప్రవేశ పరీక్షలో బీసీ గురుకుల ఇంటర్ విద్యార్థులు 248 మంది హాజరు కాగా , అందులో 98మంది తమ ప్రతిభను చాటారు. అందులో 50 మంది బాలికలు, 48 మంది బాలురు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో ఇ. వైష్ణవి (96.78), జి. శ్రీహిత (93.5), బి. వైష్ణవి (93.5), బి. మేఘన(91.5)కె. శిరీష(89.2), ఎ. మేఘన(88.8), ఎన్ . కావేరి(86) శాతం మార్కులు సాధించారు.
బాలుర విభాగంలో కె. శ్రీనివాస్(97.51), కెవిఎన్. నీహాల్ (95.49) , కె. అఖిల్(94.53), బి. నిఖిల్(94.42) శాతం మార్కులు సాధించారు. అత్యుత్తమ ప్రతిభను చూపిన విద్యార్థులను, బోధనా సిబ్బందిని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ , ప్రిన్సిపల్ కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఐఎఎస్, ఎంజెపి సోసైటీ కార్యదర్శి డాక్టర్ మల్లయ్యబట్టు అభినందించారు.