హైదరాబాద్,dec 7,2023: రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎనుముల రేవంత్ రెడ్డి గురువారం డా. బీఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో పదవీ బాధ్యతలను స్వీకరించారు. అనంతరం పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, సెక్రటేరియట్ అధికారులు, ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.