మైనారిటీల సంక్షేమానికి మంచి కేటాయింపులు-మహమ్మద్ ఫహీముద్దీన్ ఖురేషి
హైదరాబాద్,జులై 26,2024: తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ వైస్ చైర్మన్ మహమ్మద్ ఫహీముద్దీన్ ఖురేషి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ ఉపముఖ్యమంత్రి కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి తగిన బడ్జెట్ కేటాయించారని పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు .తెలంగాణ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి రూ.3003 కోట్లు కేటాయించగా, కేంద్ర మైనారిటీ మంత్రిత్వ శాఖకు సంబంధించిన బడ్జెట్ అంచనాలు, కొన్ని పథకాలు, కార్యక్రమాలకు స్వల్ప పెరుగుదలతో దాదాపుగా మారలేదు. ప్రకటించిన హామీలను నిలబెట్టుకున్నారని పేర్కొంటూ తెలంగాణ ముఖ్యమంత్రి , ఉపముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిబద్ధతతో ఉందన్నారు.
Post Comment