యునెస్కో గుర్తింపు ద్వారా ప్రపంచం రామప్ప వైపు చూసే గొప్ప అవకాశం

ములుగు జిల్లా: వెంకటాపురం మండలం, పాలంపేట గ్రామంలో కొలువైన రుద్రేశ్వర స్వామి దేవాలయం రామప్ప కు యునెస్కో గుర్తింపు వచ్చిన నేపథ్యంలో నేడు మంత్రులు శ్రీమతి సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకరరావు, శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, ఎంపి శ్రీమతి కవిత, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే శ్రీమతి సీతక్క, మాజీ ఎంపి సీతారాం నాయక్, ఇతర అధికారులు నేతలు రుద్రే శ్వరున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రామప్ప దేవాలయం అంతా తిరిగి చూశారు.

ఆనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

*మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్  కామెంట్స్….*

భగవంతుడు కూడా తన అభివృద్ధి ఎవరో ఒకరి ద్వారా చేసుకుంటాడు. తెలంగాణలో సీఎం కేసిఆర్ ద్వారా తన ఆలయాల అభివృద్ది అవుతుందని గుర్తించి ఆయన చేతుల మీదుగా చేయించారు.

ఆయన చేసిన యాగాలు, పుణ్యాలు, భక్తిని గుర్తించిన భగవంతుడు ఆయనతో ఈ పని చేయించారు.

యునెస్కో గుర్తింపు ద్వారా ప్రపంచం రామప్ప వైపు చూసే గొప్ప అవకాశం వచ్చింది.

తెలుగు రాష్ట్రాల్లో దేనికి లభించని గుర్తింపు మనకు రావడం నిజంగా గర్వకారణం.

సీఎం కేసిఆర్ కి తెలంగాణ, ఇక్కడి కళలు, శిల్ప నైపుణ్యం పై ఆయనకున్న పట్టు ఎవరికీ లేదు. అందుకే ఆయన కృషి ఫలించింది. రామప్పకు యునెస్కో గుర్తింపు లభించింది.

ప్రపంచ తెలుగు మహాసభలను కూడా తెలంగాణలో నిర్వహించి తెలుగు గొప్ప తనన్ని ప్రపంచానికి చాటి చెప్పారు.

ఏ టెక్నాలజీ లేనపుడు ఇంత గొప్ప కట్టడం నిర్మించడం నిజంగా చాలా గొప్ప విషయం.

కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ పేరిట పాపారావు, పాండురంగ రావు, ఎంపీలు చేసిన కృషి అన్ని తోడై నేడు దీనికి గొప్ప గుర్తింపు వచ్చింది.

యునెస్కోలో కొన్ని షరతులు పెట్టినప్పుడు గొప్ప దౌత్యం చేసి మనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ, ఇందుకు ముందడుగు వేసిన సీఎం కేసిఆర్ కి పాదాభివందనం.

ఇక్కడికి భక్తులు, పర్యాటకులు పెరుగుతున్న నేపథ్యంలో ఔట్ పోస్ట్, డ్రింకింగ్ వాటర్, కనీస వసతులు కల్పించాలని అధికారులను కోరుతున్నాను.

*మంత్రి దయాకర్ రావు  కామెంట్స్…*

గత 5 ఏళ్ల నుంచి సీఎం కేసిఆర్ చేసిన కృషి ఫలితం ఇది. ముఖ్యమంత్రి కృషిలో చాలామంది దీని వెనుక ఉన్నారు. ఎంపీలుగా, పాపారావు, పాండురంగ రావు చేసిన కృషి కీలకం.

17 దేశాలు మద్దతు పలికాయి. ఇందుకు కారణం సీఎం కేసిఆర్  రాసిన లెటర్.

దీనిని టూరిజం హబ్ గా చేసే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. స్థానికుల సహకారం అవసరం.

భూసేకరణ 27ఎకరాలు ఉంది.
మిగిలిన భూమికి రైతులు సహకరించాలి. అందరికీ న్యాయం చేస్తాం.

ఈమధ్య మళ్ళీ ఢిల్లీకి వెళ్తాం. కేంద్రంతో మాట్లాడుతాము.

రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలి.

*మంత్రి శ్రీనివాస్ గౌడ్  కామెంట్స్…*

తెలంగాణ వచ్చే వరకు ఇక్కడి చరిత్రను, వైతాళికులను సమైక్య పాలకులు పట్టించుకోలేదు. మేము తెచ్చినా పడనేయలేదు.

కేసిఆర్ ఉద్యమం చేసి, తెలంగాణ తెచ్చి, దానిని కాపాడుతూ నేడు దేశ, ప్రపంచ స్థాయిలో గర్వించే పథకాలు తెచ్చి ఇక్కడ అమలు చేస్తున్నారు.

నేడు ఈ రామప్పను ప్రపంచ పటంలో గుర్తించే విధంగా యునెస్కో గుర్తింపు ద్వారా దీనికి ఖ్యాతి వచ్చింది.

ఈ గడ్డ మీద మహిమకు కేసిఆర్  వచ్చాకే గుర్తింపు వచ్చింది.

తెలంగాణకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు తీసుకొచ్చేందుకు సీఎం కేసిఆర్  చేస్తున్న కృషికి
ఇదొక ఉదాహరణ.

కరెంట్ విషయంలో గతానికి, ఇప్పటికీ నక్కకు, నాగలోకానికి ఉన్న తేడా ఉంది.

గతంలోనే రామప్పకు గుర్తింపు వస్తె ఇక్కడ ఎంతోమంది జీవితాలు మారేవి… ధన్యమయ్యేది ఈ ప్రాంతం.

కానీ వాళ్ళు గుర్తింపు రానివ్వలేదు. ఈ ప్రాంతాన్ని ఆగం చేశారు. అందుకే సీఎం కేసీఆర్  వచ్చాక  నేడు మనం మంచిగా అవుతున్నాం.

రామప్ప దేవాలయం కు గుర్తింపు వస్తె పర్యాటక రంగం అభివృద్ది చెందుతుందని, ఈ ప్రాంత భవిష్యత్తు మారుతుందని సీఎం  వెంటపడి దేనికి యునెస్కో గుర్తింపు కోసం ప్రయత్నం చేశారు.

17 దేశాలు అనేక ప్రశ్నలు వేస్తే వాటికి సమాధానం ఇచ్చి, అడిగినవన్నీ చేసి దీనికి హోదా వచ్చే విధంగా చేశారు. ఇది ఈ ప్రాంతానికి, రాష్ట్రానికి, దేశానికి గర్వ కారణం.

యాదాద్రి దేవాలయం కూడా వెయ్యి కోట్ల రూపాయలతో అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారు.

గత మూడు, నాలుగు సంవత్సరాలుగా 7 కోట్లు రామప్ప కోసం ఖర్చు పెట్టాం.
ఇంకా అభివృద్ధికి నిధులు కేటాయింపునకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నాం.

కాకతీయ హెరిటేజ్ టూరిస్ట్ సర్క్యూట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉంది…దానిని ఏర్పాటుకు సీఎం కేసిఆర్  దృష్టికి తీసుకెళ్ళి చేసే ప్రయత్నం చేస్తాం.

సీఎం కేసిఆర్ కు ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే అత్యంత ప్రేమ ఉంది. కచ్చితంగా ఇక్కడ అడిగినవన్నీ చేస్తారు.

ఈ ప్రాంత చరిత్రను కాపాడే బాధ్యత ఇక్కడి ప్రజలది కాబట్టి సహకరించాలి.

ఇక్కడ ఎవరికి నష్టం జరగకుండా చూస్తాం

ఇంతటి ప్రతిష్ట రావడానికి కారణం అయిన సీఎం కేసిఆర్ కి పాదాభివందనం.

print

Post Comment

You May Have Missed