మహాదేవ మమ్ముబ్రోవరా…ఆకట్టుకున్న భజనలు

*Sahasra deepaarchana seva performed in Srisaila devasthanam on 18th oct.2021.

* P.Shameen Kumar, Visakhapatnam donated Rs.1,01,116/- For Annadanam  scheme.

* G. Sai Rushansh Nandan, Guntur donated Rs.1,01,116/- For Annadanam scheme.

* G. Sai Nidhansh Nandan, Guntur donated Rs.1,01,116/- For Annadanam scheme.

* శ్రీశైల దేవస్థానం:దేవస్థానం నిర్వహిస్తున్న “నిత్యకళారాధన” (నివేదన) కార్యక్రమంలో భాగంగా ఈరోజు (18.10.2021)  ఎస్.రంగయ్య అండ్ బృందం, మహానంది, గాజులపల్లి వారిచే భజన కార్యక్రమం జరిగింది .

ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వద్ద ఈ రోజు సాయంకాలం గం.6:30 ని||ల నుండి ఈ భజన కార్యక్రమం ఏర్పాటు చేసారు.

ఈ కార్యక్రమంలో అందాలమ్మ భ్రమరాంబా, గజముఖవదనా, శ్రీశైలశివమయం, శంభో శివశంకర, , కరుణించరా మహాదేవా, మమ్ము కాపాడవయ్యా, ఏది నీదయరాదా, శ్రీశైలవాసా, మనసారా నీ స్మరణ చేసేము వంటి తదితర భక్తి భజన పాటలను ఆయా భజనలను చేసారు.

కాగా ఈ నిత్య కళారాధనలో ప్రతి రోజూ హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసారు.

శ్రీ స్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని,  ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్య కళారాధన (నివేదన) కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఈ కార్యక్రమాలలో ముఖ్యంగా స్థానిక కళాకారులకు , జిల్లాలోని కళాకారులకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

| రేపటి నిత్య కళారాధన

రేపు (19.10.2021) శ్రీమతి వేదాంతం కామాక్షి, శ్రీ బాలాత్రిపురసుందరి నృత్య నికేతన్, నెల్లూరు వారిచే సంప్రదాయనృత్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేసారు.

print

Post Comment

You May Have Missed