×

వైద్య సేవలలో పెను మార్పులు తీసుకొచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే-తలసాని

వైద్య సేవలలో పెను మార్పులు తీసుకొచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే-తలసాని

హైదరాబాద్: ప్రభుత్వ వైద్య సేవలలో పెను మార్పులు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదేనని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. శనివారం గాంధీ హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన 2 టిఫా  స్కానింగ్  మిషన్ లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఫా స్కానింగ్ తో గర్భంలో ఉన్న శిశువు ఆరోగ్య స్థితిని తెలుసుకోవచ్చని తెలిపారు. ఈ స్కానింగ్ కోసం ప్రైవేట్ హాస్పిటల్స్ లో 3 నుండి 5 వేల రూపాయల వరకు వసూలు చేస్తారని, ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఉచితంగా నిర్వహిస్తారని  చెప్పారు. 20 కోట్ల రూపాయల వ్యయంతో 56 టిఫా స్కానర్ లను కొనుగోలు చేసి ఈ ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ హాస్పిటల్స్ లలో ప్రారంభించినట్లు వివరించారు. ఈ స్కానర్ తో గర్బిణీ కి పరీక్ష నిర్వహించడం వలన గర్భంలోని శిశువు అవయవాల ఎదుగుదలలో లోపాలు  ఉంటే ముందే తెసుకొని అవసరమైన జాగ్రత్తలు తీసుకొనే అవకాశం ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వందల కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకు రావడమే కాకుండా హాస్పిటల్స్ అభివృద్ధి చేసామని చెప్పారు. ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన ను అనే వారని…ప్రభుత్వం అనేక రకాల వైద్య సేవలు, అధునాతన వైద్య పరికరాలను తీసుకురావడంతో నేడు ప్రభుత్వ హాస్పిటల్స్ కు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు.  ఎంతో చరిత్ర కలిగిన గాంధీ హాస్పిటల్ లో కార్పోరేట్ హాస్పిటల్స్ కు దీటుగా అనేక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. ఇప్పటికే గాంధీ హాస్పిటల్ లో క్యాథ్ ల్యాబ్ ను ప్రారంభించుకున్నామని , దీనితో గుండె సంబంధిత ఇబ్బందులను గుర్తించి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం, వైద్య సేవలు అందిస్తారని  తెలిపారు. ఇదే కాకుండా CT స్కాన్, MRI స్కాన్ వంటివి కూడా అందుబాటులోకి తీసుకువచ్చిన విషయాన్ని వివరించారు. అన్ని రకాల వైద్య సేవలకు, చికిత్సలకు నిలయంగా గాంధీ హాస్పిటల్ ను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఆరోగ్య శాఖ మంత్రిగా  హరీష్ రావు బాద్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ హాస్పిటల్స్ లో అనేక నూతన వైద్య సేవలను అందుబాటులోకి వచ్చాయని  వివరించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగంలో సాధించిన ప్రగతిని దేశంలోని ఏ రాష్ట్రంలో జరగలేదని మంత్రి  అన్నారు. వైద్యం కోసం అనేక మంది ప్రైవేట్ హాస్పిటల్స్ కు వెళ్ళి పరీక్షల కోసమే వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని, ప్రభుత్వ హాస్పిటల్స్ లో అనేక రకాల అధునాతన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇక్కడ వైద్య పరీక్షలు, మందులు, చికిత్సలు ఉచితంగానే అందిస్చెతారని  చెప్పారు. కేవలం వైద్య సేవలు మాత్రమే కాకుండా రోగుల వెంట వచ్చే సహాయకుల విషయంలో కూడా ప్రభుత్వం తగు ఆలోచనలు చేస్తుందని చెప్పారు. హాస్పిటల్ కు వచ్చినప్పుడు భోజనం కోసం రోగుల సహాయకులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని హాస్పిటల్ ఆవరణ లోనే అతి తక్కువ ధరకు భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు, కార్పొరేటర్ హేమలత, RMO విజయకృష్ణ, శాంతి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed